వైఎస్సార్సీపీలోకి.. జీవీఎంసీ స్వతంత్ర కార్పొరేటర్లు..

Published : Jun 05, 2021, 12:28 PM IST
వైఎస్సార్సీపీలోకి.. జీవీఎంసీ స్వతంత్ర కార్పొరేటర్లు..

సారాంశం

ఇటీవల జరిగిన విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో కార్పొరేషన్‌లో వైఎస్సార్సీపీ బలం 61కి పెరిగింది. 

విశాఖ నగరం తిమ్మాపురంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీలోని 32, 35, 39వ వార్డులకు చెందిన స్వతంత్ర కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహమ్మద్‌ సాధిక్‌లకు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వీరితోపాటు జీవీఎంసీ మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నాయకుడు సూరిశెట్టి లక్ష్మణ్‌ కూడా పార్టీలో చేరారు. అలాగే వైఎస్సార్సీపీ నుండి సస్పెన్షన్‌కు గురైన తాతారావును కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. 

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసే కార్యాచరణపై వారితో చర్చించారు. సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ , విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కేకే రాజు ,వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, పార్టీ సీనియర్ నాయకులు పల్లా దుర్గారావు, లక్షణరావు  పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu