సరదా కోసం కాలువలో దిగి.. ముగ్గురు స్నేహితులు మృతి

Published : Jun 05, 2021, 09:26 AM IST
సరదా కోసం కాలువలో దిగి.. ముగ్గురు స్నేహితులు మృతి

సారాంశం

వీరంతా ప్రాణ స్నేహితులు కాగా.. వీరిలో ప్రభు.. కాకినాడలో సొంతంగా మెకానిక్ షాప్ పెట్టాలని అనుకున్నాడు.

వారంతా ప్రాణ స్నేహితులు.. ఒకే చోట పుట్టి.. ఒకే చోట పెరిగారు. ఒకే చోట అందరూ కలిసి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. వారిలో ఒకరికి ఇలా పనులు కాకుండా.. సొంతంగా తన కాళ్ల మీద తాను నిలపడాలని అనుకున్నాడు. అందుకే ఓ దుకాణం కూడా పెట్టాడు. స్నేహితుడికి మద్దతుగా వీరంతా కూడా అక్కడికి వెళ్లారు. దుకాణం ఓపెన్ చేసి అంతా ఆనందంగా గడిపారు. దగ్గర్లో ఓ కాలువ ఉంటే.. సరదాగా గడుపుదామని వెళ్లి... ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షంఘటన సూళ్లూరుపేటలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూళ్లూరుపేటలోని హిందూ స్మశాన వాటిక ఎదురుగా ఉన్న ఓ బైక్ రిపేర్ షాప్ లో సునీల్ కుమార్, సుమంత్, సెల్వకుమార్, శివ, మోహన్, ప్రసాద్, రాజు, అరవింద్, ప్రభులు పనిచేస్తున్నారు. వీరంతా ప్రాణ స్నేహితులు కాగా.. వీరిలో ప్రభు.. కాకినాడలో సొంతంగా మెకానిక్ షాప్ పెట్టాలని అనుకున్నాడు.

ఈ క్రమంలో మంచి దుకాణం కూడా వెతికారు. శుక్రవారం మంచి రోజని స్నేహితులతో కలిసి ఆ దుకాణం ప్రారంభించారు. సరదాగా ఆనందంగా గడిపారు. ఆ తర్వాత దగ్గరలోని తెలుగు గంగ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లారు.

లోతు తక్కువగా ఉంది కదా అని అందరూ దిగి ఈత కొట్టడం మొదలుపెట్టారు. అయితే.. లోతు ఎక్కువ ఉందనే విషయం వారు గమనించలేదు.  ఈ క్రమంలో రాజు(25) నీటిలో మునిగిపోవడంతో గుర్తించిన ప్రభు(30) కాపాడేందుకు ప్రయత్నంచాడు. ఇది చూసిన అరవింద్(18) కూడా వారిద్దరిని కాపాడేందుకు నీటిలోకి దిగాడు. 

అయితే.. ముగ్గరూ నీట మునిగి ప్రాణాలు కోల్పోవడంతో.. స్థానికంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీరిలో రాజు కాకినాడకు చెందిన వాడు కాగా.. అరవింద్ ది సూళ్లూరుపేట కావడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu