నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియాలలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం నాడు గ్యాస్ లీకై ముగ్గురు మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు.
నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియాలలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం నాడు గ్యాస్ లీకై ముగ్గురు మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియాలలోని కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం నాడు గ్యాస్ లీకై ముగ్గురు మరణించారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. pic.twitter.com/s4fAJXTJOy
— Asianetnews Telugu (@AsianetNewsTL)
undefined
గ్యాస్ లీకేజీలో ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా, టెక్నికల్ సమస్యలు నెలకొన్నాయా అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో ఈ ఫ్యాక్టరీలో పలు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఇటీవల కాలంలో రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇవాళ ఉదయం కార్మికులు విధులకు హాజరైన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. వెంటనే ఫ్యాక్టరీ సిబ్బంది గ్యాస్ లీకేజీని అరికట్టారు. దీంతో పెద్ద ప్రమాదాన్ని నివారించారు. ఈ ప్రమాదంపై అధిాకరులు విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.గత ఏడాది మే మొదటివారంలో విశాఖ జిల్లాలోని ఎల్జీ పాలీమర్స్ లో గ్యాస్ లీకై పలువురు మరణంచిన విషయం తెలిసిందే.