రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం: ముగ్గురు మృతి

Published : Sep 22, 2018, 07:43 AM IST
రాజమహేంద్రవరంలో భారీ అగ్ని ప్రమాదం: ముగ్గురు మృతి

సారాంశం

దీపావళి కోసం బాణసంచా చేస్తూ నిల్వఉంచిన ఉంచడంతో సంభవించిన పేలుడులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు సమీపంలోని ఒక తాటాకు ఇంటిలో ఈ ప్రమాదం సంభవించింది.   

రాజమహేంద్రవరం: దీపావళి కోసం బాణసంచా చేస్తూ నిల్వఉంచిన ఉంచడంతో సంభవించిన పేలుడులో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజమహేంద్రవరం నగరంలోని లాలాచెరువు సమీపంలోని ఒక తాటాకు ఇంటిలో ఈ ప్రమాదం సంభవించింది. 

గాయపడినవారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిల్వ ఉంచిన బాణసంచా పేలి ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన గ్యాస్ సిలిండర్ పేలిందని కూడా చెబుతున్నారు. 

మరణించినవారిలో ధనలక్ష్మి అనే మహిళ ఉంది. వీరంతా అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు.

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!