పెన్నా నదిలో యువకుల గల్లంతు: మరో నాలుగు మృతదేహాలు లభ్యం

Siva Kodati |  
Published : Dec 18, 2020, 02:21 PM IST
పెన్నా నదిలో యువకుల గల్లంతు: మరో నాలుగు మృతదేహాలు లభ్యం

సారాంశం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో ఏడుగురు గల్లంతైన ఘటనలో ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో ఏడుగురు గల్లంతైన ఘటనలో ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు. మరొకరి కోసం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో 60 మంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.     

సిద్ధవటంలో దిగువపేటకు చెందిన వెంకటశివ తండ్రి చంద్రశేఖర్‌ వర్థంతి కార్యక్రమం గురువారం జరిగింది. శివతో పాటు మరో 10 మంది పెన్నా నది దగ్గరకు వెళ్లారు. వీరిలో 8 మంది సరదాగా స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. ఈ క్రమంలో వీరంతా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. శివ అతికష్టం మీద బయటపడగా మిగతా ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu