రోజంతా బాబుతోనే: మూడు రోజుల తర్వాత బీజేపీలోకి సీఎం రమేష్

By narsimha lodeFirst Published Jun 25, 2019, 3:04 PM IST
Highlights

రాజ్యసభలో టీడీపీపీని  బీజేపీలో విలీనం చేయాలని  లేఖ ఇవ్వడానికి  మూడు రోజుల ముందు ఓ ఎంపీ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు యూరప్ టూర్‌కు వెళ్లగానే  టీడీపీపీని బీజేపీలో విలీసం చేస్తున్నట్టుగా రాజ్యసభ ఛైర్మెన్‌కు లేఖ ఇచ్చారు.

అమరావతి: రాజ్యసభలో టీడీపీపీని  బీజేపీలో విలీనం చేయాలని  లేఖ ఇవ్వడానికి  మూడు రోజుల ముందు ఓ ఎంపీ చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు యూరప్ టూర్‌కు వెళ్లగానే  టీడీపీపీని బీజేపీలో విలీసం చేస్తున్నట్టుగా రాజ్యసభ ఛైర్మెన్‌కు లేఖ ఇచ్చారు.

టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడుతో అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలే ఆ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేసే కార్యక్రమంలో  బాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే పాల్పడ్డారు.

అయితే టీడీపీపీని బీజేపీలో విలీనం చేసేందుకు లేఖ ఇవ్వడానికి మూడు రోజుల ముందు  సీఎం రమేష్ చంద్రబాబు అత్యంత సన్నిహితంగా మెలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై ఈ నెల 14వ తేదీన చంద్రబాబునాయుడు విజయవాడలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశానికి టీజీ వెంకటేష్ మినహా ముగ్గురు ఎంపీలు  హాజరయ్యారు. చంద్రబాబుతో పాటే ఆయన పక్కనే కూర్చొని  సీఎం రమేష్  ఆ రోజు భోజనం చేశారు.  రోజంతా చంద్రబాబుతోనే  ఆయన గడిపారు. కానీ, టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని రాజ్యసభ చైర్మెన్‌ వెంకయ్యనాయుడుకు ఇచ్చిన లేఖపై సీఎం రమేష్ కూడ సంతకం చేశారు. 

ఈ సమావేశం జరిగిన రోజు సాయంత్రమే నలుగురు ఎంపీలు టీడీపీని వీడి  బీజేపీలో చేరుతారని విజయవాడ ఎంపీ కేశినేని నాని  కొందరి దృష్టికి తీసుకొచ్చినట్టుగా సమాచారం.  నాని చెప్పినట్టుగానే  రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారు. 

click me!