ఏపీలో మూడు కరోనా వైరస్ కేసుల నమోదు, ప్రభుత్వం అప్రమత్తం

Published : Mar 20, 2020, 09:53 AM IST
ఏపీలో మూడు కరోనా వైరస్ కేసుల నమోదు, ప్రభుత్వం అప్రమత్తం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. వాటి వివరాలను జవహర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చినవారికే ఆ కరోనా లక్షణాలు కనిపించాయి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో మస్కట్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే లండన్ నుంచి ఒంగోలు వచ్చిన ఓ యువకుడికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, మక్కా నుంచి విశాఖపట్నం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్ -19 (కరోనా) వైరస్ నిరోధక చర్యలపై  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖబులిటెన్ విడుదల చేసింది. విశాఖపట్నంలో ఒక కోవిడ్-19 పోజిటివ్  కేసు నమోదయ్యింది. 

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొవిడ్ -19 పాజిటివ్ బాధితులు కోలుకుంటున్నారనివైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో  వదంతుల్ని నమ్మొద్దని, కొవిడ్-19 వార్తల విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దాన్ని అతిక్రమిస్తే 'ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపిసి సెక్షన్ 188' ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మాస్కులు , శానిటైజర్ల  కొరత లేదని, కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని, పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని సూచించారు.                 

వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని చెప్పారు. కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 966 మంది  ప్రయాణికుల్ని గుర్తించామని చెప్పారు. 677 మంది ఇళ్లలోనే  వైద్యుల పరిశీలనలో ఉన్నారని అన్నారు. 258 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. 

31 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నారని, 119 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 104 మందికి నెగటివ్ వచ్చిందిని చెప్పారు. 12 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని జవహర్ రెడ్డిచెప్పారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి వెళ్లకూడదని సూచించారు. 

కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ కలవకూడదుని, 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని జవహర్ రెడ్డి అన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేసినట్లు జవహర్ రెడ్డి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Miss India 2020 Manasa Varanasi Visit Tirumala:తిరుమలలో మిస్ ఇండియామానస వ‌రణాసి| Asianet News Telugu
CM Chandrababu Naidu: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu