విజయవాడకు అమరావతి రైతులు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ యాత్రను అడ్డుకొంటామని పోలీసులు ప్రకటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని జేఎసీ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం నాడు విజయవాడకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.. ఈ పాదయాత్ర నేపథ్యంలో తుళ్లూరుకు చెందిన కొందరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
రైతుల ఆందోళన ఇవాళ్టికి 24వ రోజుకు చేరుకొంది. విజయవాడకు రైతుల పాదయాత్ర పిలుపు నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
undefined
అమరావతి పరిసరాల్లోని 29 గ్రామాల్లో పోలీస్ నిఘాపెంచారు. ఈ గ్రామాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు.ఈ నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకొంటామని ఎస్పీ విజయరావు హెచ్చరించారు.
Also read:సీమలో హైకోర్టు పెడితే.. పది జిరాక్స్ షాపులు వస్తాయి, ఇంకేం లేదు: జేసీ వ్యాఖ్యలు
ఇవాళ విజయవాడ పాదయాత్రను అడ్డుకొంటామని పోలీసులు చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మకి పసుపు ,కుంకుమ ,గాజులు బట్టలు,నైవేద్యం చెల్లించడానికి వెళ్లాలని 29 గ్రామాల ప్రజలు భావిస్తున్నారు. 29 గ్రామాల ప్రధాన కూడళ్లలో ముళ్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు.
తుళ్లూరుకు చెందిన పువ్వాడ.గణేష్,బండ్ల.తేజ,కాటా.అప్పారావు, ఉప్పలపాటి.సాంబశివరావు,మార్తా.రవి అనే రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లను నర్సరావుపేట పోలీసుస్టేషన్ కు తరలించారు.