శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల కలకలం: టిఫిన్ సెంటర్లో దూరిన మూడు భల్లూకాలు

By narsimha lodeFirst Published Aug 8, 2022, 10:35 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలో మరోసారి ఎలుగుబంట్లతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్లో మూడు ఎలుగుబంట్లు దూరడంతో స్థానికులు భయపడుతున్నారు. గతంలో కూడా ఇదే మండలంలో ఎలుగుబంటి దాడి చేయడంతో ముగ్గురు మరణించారు.
 

శ్రీకాకుళం: జిల్లాలోని Vajrapukotturu మండలంలో మరోసారి ఎలుగుబంట్లు కలకలం సృష్టించాయి. ఓ ఫాస్ట్ పుడ్ సెంటర్లో మూడు ఎలుగుబంట్లు దూరాయి. దీంతో స్థానికులు  భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ ఏడాది జూన్ 21వ తేదీన వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఉన్న ఎలుగుబంటిని  అటవీశాఖాధికారులు బంధించారు. ఈ ఎలుగుబంటిని విశాఖ జూకు తరలించారు. అయితే ఈ ఎలుగుబంటి మరణించింది. వజ్రపుకొత్తూరు మండలంలోని కిడిసింగి గ్రామానికి చెందిన కోదండరావు ఎలుగుబంటి దాడిలో  మరణించాడు. కోదండరావుతో పాటు మరో ఇద్దరు కూడా  ఎలుగు బంటి దాడిలో మరణించారు. ఈ ఘటన మరువకముందే ఇదే మండలం చిన వంక గ్రామంలో మూడు ఎలుగుబంట్లు ఇవాళ ఓ టిఫిన్ సెంటర్ లోకి చేరాయి.ఈ విషయాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో పెద్ద ఎత్తున జీడి మామిడి తోటలుంటాయి. ఈ తోటల్లోనే ఎలుగుబంట్లు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.  ఇవాళ టిఫిన్ సెంటర్ లో రెండు పిల్లలతో కలిసి తల్లి ఎలుగు బంటి కూడా ఈ టిఫిన్ సెంటర్ లో ఉంది. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

జీడి మామిడి తోటలు ఎలుగుబంట్లకు ఆలవాలంగా మారాయి.  ఆపరేషన్ బంటి సక్సెస్ అయింది. తల్లి ఎలుగుబంటితో పాటు రెండు చిన్న పిల్లలు కూడా దానితో ఉన్నాయి. దీంతో ఈ మూడు ఎలుగు బంట్లను బంధించేందుకు అటవీశాఖాధికారులు రంగంలోకి దిగారు. జీడి మామిడి తోటల్లోకి ఒంటరగా వెళ్లాలంటేఈ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ఎలుగుబంట్లు దాడి చేసే అవకాశం ఉందని గుంపులు గుంపులుగా వారు తోటల వైపునకు వెళ్తున్నారు. తమకు ఎలుగు బంట్లు గ్రామాల్లోకి రాకుండా ఉండేలా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
 

click me!