హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో అసలుదా, నకిలీదా అనే విషయమై ఇంకా రిపోర్టు రాలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ వీడియో అసలుదని తేలితే మాధవ్ పై చర్యలు తీసుకొంటామని ఆయన స్పష్టం చేశారు.
అమరావతి: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో అసలుదా, నకిలీదా అనే విషయమై ఇంకా రిపోర్టు రాలేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy చెప్పారు.
సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. Gorantla Madhav అశ్లీల వీడియో నిజమైందని తేలితే ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసకొంటామన్నారు. ఈ వీడియోకు సంబంధించిన నివేదిక ఇంకా రాలేదన్నారు.నివేదిక వచ్చేవరకు ఆగాలన్నారు. అంతేకాదు గోరంట్ల మాధవ్ లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టుగా కూడా ఎవరూ కూడా ఫిర్యాదు చేయని విషయాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.
ఏడేళ్లైనా కూడా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ పై క్లారిటీ రాలేదన్నారు.
గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ వీడియో మార్పింగ్ వీడియో అని గోరంట్ల మాధవ్ ప్రకటించారు. అరగంటలో ఈ వీడియో అసలుదో, నకిలీదో తేలుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారన్నారు. అయితే ఏడేళ్లుగా చంద్రబాబు వాయిస్ విషయమై ఎందుకు తేలలేదో చెప్పాలన్నారు.
తనను అప్రదిష్టపాల్జేసేందుకు TDP నేతలు ప్రయత్నించారని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ పాత్రుడితో పాటు మరో ఇద్దరిపై కూడా మాధవ్ ఆరోపణలు చేశారు.ఈ వీడియోపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడ మాధవ్ చెప్పారు.
గత వారంలో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.దీంతో ఈ వీడియోపై గోరంట్ల మాధవ్ న్యూఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తాను జిమ్ చేసే వీడియోను మార్పింగ్ చేశారని మాధవ్ చెప్పారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ వీడియోను సృష్టించారన్నారు.