వైసిపిలోకి టీడీపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు: వైవీ సుబ్బారెడ్డితో భేటీ

By Nagaraju penumalaFirst Published Feb 18, 2019, 5:29 PM IST
Highlights

ఈ ప్రచారం నేపథ్యంలో విజయవాడలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డితో తోట త్రిమూర్తులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీలోకి ఇతర పార్టీ నేతలను ఆహ్వానించే వారిలో వైవీ సుబ్బారెడ్డి ఒకరు. అయితే దాదాపు అరగంట నుంచి వీరి భేటీ కొనసాగుతుందని తెలుస్తోంది. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. గత కొద్దిరోజులుగా తోట త్రిమూర్తులు పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుంది. 

ఈ ప్రచారం నేపథ్యంలో విజయవాడలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డితో తోట త్రిమూర్తులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీలోకి ఇతర పార్టీ నేతలను ఆహ్వానించే వారిలో వైవీ సుబ్బారెడ్డి ఒకరు. అయితే దాదాపు అరగంట నుంచి వీరి భేటీ కొనసాగుతుందని తెలుస్తోంది. 

తోటత్రిమూర్తులు కాకినాడ ఎంపీగా, తనయుడుకి రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని తోట త్రిమూర్తులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. 

నాలుగు నియోజకవర్గాలను ప్రభావితం చెయ్యగల నాయకులను ఇతర పార్టీలు ఆహ్వానిస్తుంటాయని అందులో తప్పేం లేదంటూ చెప్పుకొచ్చారు. ఉదయమే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమలాపురం ఎంపీ పండు రవీంద్రబాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.  

థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు

click me!