తీరం దాటినా తప్పని ముప్పు.. మరో నాలుగు గంటల పాటు భారీ వర్షాలు

By sivanagaprasad kodatiFirst Published Oct 11, 2018, 9:10 AM IST
Highlights

తిత్లీ తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మాత్రం ఉత్తరాంధ్రపై కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జల్లా వణికిపోతోంది.  మరో నాలుగు గంటల పాటు సిక్కోలుకు భారీ వర్షాలు తప్పవని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

తీరం వెంట గంటకు 160 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటంతో పాటు అలలు కొన్ని మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇచ్ఛాపురం, నందిగాం, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు మండలాలపై తిత్లీ అధిక ప్రభావాన్ని చూపుతోంది.

సాయంత్రానికి 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గాలుల తీవ్రతకు జీడి మామిడి తోటలకు అపారనష్టం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భోగాపురం వద్ద జాతీయ రహదారిని మూసివేసిన అధికారులు. శ్రీకాకుళం వరకు వెళ్లే బస్సులకు మాత్రమే అనుమతినిస్తున్నారు.

అర్థరాత్రి 12.10 a.m.. ఆయన పనిలో ఆయన

తీరం తాకిన తుఫాను: శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం

click me!