ఈ గణేశుడి పేరిట పేటిఎం, గూగుల్ పే అకౌంట్....

By Arun Kumar PFirst Published Sep 20, 2018, 5:38 PM IST
Highlights

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరక్కుండా సెల్ పోన్లు, కంప్యూటర్లలోనే నగదు లావాదేవీలు జరపడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. వినియోదదారుల సౌకర్యం కోసం బ్యాంకులు కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిజిటల్ టెక్నాలజీని పోత్సహిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని తాను కూడా ప్రోత్సహించాలని భావించాడో ఏమో గాని గణనాథుడు కూడా డిజిటల్ లావాదేవీలు జరపడానికి సిద్దమయ్యాడు. విఘ్న నాయకుడు తన భక్తుల కానుకలను పేటీఎం, గూగుల్ పే రూపంలో స్వీకరిస్తున్న అరుదైన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా లింగంపాలెం మండలం రంగాపురం గ్రామంలో కొందరు యువకులు వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. అయితే వారు తమ వినాయకుడి కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ నంబరు తీసుకుని దాని ద్వారా డిజిటల్ లావాదేవీలు జరపడం ప్రారంభించారు. భక్తులు పేటీఎం, గూగుల్ పే ఆప్‌ల ద్వారా  వినాయకుడికి సమర్పించుకోవాలనుకునే నగదు కానుకలను స్వీకరిస్తున్నారు. ఇలా చాలామంది తమ వినాయకుడికి డిజిటల్ రూపంలో నగదు సమర్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. డిజిటల్ రూపంలో నగదు రహిత లావాదేవీలు జరపాలన్న సూచనల మేరకు తాము ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

భక్తికి ఆదునిక టెక్నాలజీని జోడించి యువకులు చేసిన ఈ ప్రయోగం బాగుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విధానం సౌకర్యవంతంగా ఉందని యువకులు, స్ధానిక ప్రజలు మెచ్చుకుంటున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. 

click me!