ఆంధ్రప్రదేశ్ లో ఇక 26 జిల్లాలు.. నేడు నోటిఫికేషన్.. జిల్లాల వివరాలివే...

Published : Jan 26, 2022, 08:00 AM IST
ఆంధ్రప్రదేశ్ లో ఇక 26 జిల్లాలు.. నేడు నోటిఫికేషన్.. జిల్లాల వివరాలివే...

సారాంశం

రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా,  అరకు లోక్సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో..  దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.  ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్  కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు ఉంచారు.  మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.  వచ్చే ఉగాది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే…  భౌగోళిక,  సామాజిక,  సాంస్కృతిక  పరిస్థితుల్ని,  సౌలభ్యాలను  దృష్టిలో ఉంచుకుని  కొత్త జిల్లాల సరిహద్దులు నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉండగా,  అరకు లోక్సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో..  దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.  ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్  కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు ఉంచారు.  మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.  కొత్త జిల్లాల ప్రక్రియ గురించి వారికి వివరించి అభిప్రాయాలు సూచనలు తీసుకున్నారు.

కసరత్తు జరిగిందిలా..  
కొత్త జిల్లాల ఏర్పాటు పై 220 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటయ్యింది.  ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది  పునర్వ్యవస్థీకరణ,  ఆస్తులు,  మౌలిక  వసతులు,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి  ఈ అంశాలపై మొత్తం నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు.

- జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు అయ్యాయి.

- ప్రణాళిక విభాగం అధ్యయనం చేసి ఒక నివేదిక అందజేసింది.

- కొన్నింటికి  పాత పేర్లు…
- జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా..  ఇప్పుడున్న జిల్లా కేంద్రాలతో ఏర్పాటయిన జిల్లాలకు పాత పేర్లనే ఉంచారు. మిగతా జిల్లాల్లో కొన్నింటిని వాటి జిల్లా కేంద్రాల పేర్లతో ఏర్పాటు చేయగా,  కొన్నిటికి  balaji,  అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, ఎన్టీఆర్,  సత్యసాయిబాబాల పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

- విజయనగరం జిల్లాలోని  పార్వతీపురం కేంద్రంగా  మన్యం జిల్లాను ఏర్పాటు  చేశారు. విశాఖలోని పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లా కి అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయనున్నారు.  తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ  జిల్లాను, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను, రాయచోటి  కేంద్రంగా  అన్నమయ్య  జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా  శ్రీ సత్యసాయి జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు.

- అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఆయా ప్రాంతాల్లో వ్యవహారిక నామాలతో ఏర్పాటు చేయనున్నారు.

- కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో ఒక శాసనసభ స్థానం పూర్తిగా ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

- ఒక లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలు కచ్చితంగా దాని పరిధిలోకే రావాలన్న నిబంధన పెట్టుకోలేదు.  ఒక లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా శాసనసభ స్థానం, కొత్తగా ఏర్పడిన పక్క జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉంటే, దాన్ని ఆ జిల్లా పరిధిలోకి తీసుకువచ్చారు. ఉదాహరణకు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం లోని సంతనూతలపాడు శాసనసభ స్థానం ఒంగోలు నగరానికి సమీపంలో ఉంటుంది. కాబట్టి సంతనూతలపాడు కొత్తగా ఏర్పాటయ్యే బాపట్ల జిల్లాకు బదులు, ఒంగోలు జిల్లాలో చేర్చారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల జరిగాయి. కర్నూలుకు ఆనుకొని ఉండే పాణ్యం నియోజకవర్గాన్ని  నంద్యాల నుంచి  మినహాయించి కర్నూలు జిల్లాలో కలిపారు.

- చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గం తిరుపతికి ఆయనకుంది.  దాన్నితిరుపతి కేంద్రంగా ఏర్పాటు అయినా  balaji జిల్లాలోకి తెచ్చారు. Tirupati  లోక్సభ స్థానం పరిధిలోని  సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా పరిధిలోకి తెచ్చారు.

- మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలోని పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉంటాయి. వాటిని మాత్రం విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే ఎన్టీఆర్ జిల్లాలోకి తేకుండా, మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలోనే ఉంచేశారు.

- ఈ మార్పులు, చేర్పులు వల్ల కొన్ని జిల్లాల పరిధిలోకి ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలు వస్తుంటే,  కొన్ని జిల్లాలో ఆరు శాసనసభ స్థానాలకు ఏర్పాటవుతున్నాయి.

ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు
 - ఒంగోలు ( బాపట్ల పరిధిలోని సంతనూతలపాడు ఒంగోలు లో కలిపారు)
-  కర్నూలు ( నంద్యాల నంద్యాల పరిధిలో పాణ్యం నియోజకవర్గాన్ని కర్నూలు  జిల్లాలొకి తెచ్చారు)
-  శ్రీకాకుళం  ( విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శ్రీకాకుళం లో కలిపారు)
-  అనంతపురం జిల్లాలో ఆ లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు రాప్తాడును చేర్చారు.

 ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పాటవుతున్న జిల్లాలు…

-  నంద్యాల ( దీనిపరిధిలోని పాణ్యంను  కర్నూలు లో కలిపారు)
-  విశాఖపట్నం ( దీనిపరిధిలోని  ఎస్ కోటను  కోట విజయనగరం లో కలిపారు)
-  భౌగోళికంగా సుదీర్ఘ ప్రాంతం,  పూర్తి గిరిజన జనాభా తో కూడిన రెండుగా విభజించి, రెండు జిల్లాలు చేశారు.  అయితే అయితే జిల్లాకు అరకు పేరు పెట్టలేదు. అరకు ను జిల్లా కేంద్రంగా కూడా చేయలేదు.

 - వాటిలో అల్లూరి సీతారామరాజు పేరు తో పాడేరు కేంద్రంగా ఏర్పాటవుతున్న జిల్లాలో మూడే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

-  పార్వతీపురం కేంద్రంగా ఏర్పాటు అవుతుందని జిల్లాల్లో నాలుగే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

- రాజంపేట లోక్సభ నియోజకవర్గం పరిధిగా ఏర్పాటవుతున్న  జిల్లాకి..   జిల్లా పేరు గాని,  జిల్లా కేంద్రం గానీ  రాజంపేట కాదు.  జిల్లాపేరు  అన్నమయ్యగా పెట్టారు.  రాయచోటినీ జిల్లా కేంద్రంగా చేయనున్నారు.

 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా 15 రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 62కు చేరుతుంది. 

బాపట్లలో 2 రెవెన్యూ డివిజన్లు  కొత్తవే.

జిల్లాల్ని పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో ఎక్కడా కొత్త మండలాల్ని ఏర్పాటు చేయలేదు.

 జనాభా పరంగా ( 2011 జనాభా లెక్కలు)  23 86 లక్షల మందితో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న అల్లూరి సీతారామరాజు జిల్లా 9.54లక్షల అతి తక్కువ జనాభా ఉంది

జిల్లా పేరు                                  జిల్లా కేంద్రం
శ్రీకాకుళం                                    శ్రీకాకుళం
విజయనగరం                              విజయనగరం
మన్యం జిల్లా                                పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా        పాడేరు
విశాఖపట్నం                               విశాఖపట్నం
అనకాపల్లి                                    అనకాపల్లి 
తూర్పుగోదావరి                            కాకినాడ
కోనసీమ                                       అమలాపురం
రాజమహేంద్రవరం                      రాజమహేంద్రవరం
నరసాపురం                                 భీమవరం
పశ్చిమగోదావరి                            ఏలూరు
కృష్ణా                                           మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా                               విజయవాడ
గుంటూరు                                    గుంటూరు
బాపట్ల                                          బాపట్ల
పల్నాడు                                     నరసరావుపేట
ప్రకాశం                                       ఒంగోలు
ఎస్ పీఎస్ నెల్లూరు                     నెల్లూరు
కర్నులు                                     కర్నూలు
నంద్యాల                                    నంద్యాల
అనంతపురం                             అనంతపురం
శ్రీసత్యసాయి జిల్లా                     పుట్టపర్తి
వెఎస్సార్ కడప                          కడప
అన్నమయ్య జిల్లా                     రాయచోటి
చిత్తూరు                                     చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా                          తిరుపతి
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu