
అమరావతి: విజయవాడలో చోరీ కలకలం రేపింది. Vijayawada బీసెంట్ రోడ్డు చేపల మార్కెట్లో ఓ దొంగ చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డాడు. Fish Marketలో మొబైల్ ఫోన్లు, పర్సులు చోరీ చేశాడు. ఏడాదిన్నర బాలికను వెంటబెట్టుకుని ఆ దొంగ చేపల మార్కెట్‌కు వచ్చాడు. మార్కెట్‌లో పలువురి Mobile Phones, Purseలను దొంగిలించాడు. ఈ వ్యవహారంపై వ్యాపారులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని వారే గుర్తించి పట్టుకున్నారు.
ఆ నిందితుడిని వ్యాపారస్తులు పట్టుకున్నారు కానీ, తర్వాత ఆ ఏడాదిన్నర చిన్నారిని అక్కడే వదిలి పెట్టి పరారయ్యాడు. ఇప్పుడు ఆ ఏడాదిన్నర బాలిక వ్యాపారుల ఆశ్రయంలోనే ఉన్నది. ఆ బాలిక నిందితుడి కూతురా? లేక ఆమెనూ కిడ్నాప్ చేసుకుని పట్టుకు వచ్చాడా? అనే కోణంలో అనుమానిస్తున్నారు. ఈ చోరీపై వ్యాపారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: హైద్రాబాద్‌లో రూ.3.25 లక్షలు చోరీ, డబ్బులను టాయిలెలో వేశాడు: పోలీసులకు చిక్కాడిలా...
హైదరాబాద్‌లో ఇటీవలే దొంగతనం జరిగింది జూబ్లీ హిల్స్‌లోని వస్త్ర వ్యాపారి దీపావళి పూజ నిర్వహిస్తున్న సందర్భంలో ఇంట్లో పనికి వచ్చిన ఓ వ్యక్తి లక్షల రూపాయలన కొట్టేశాడు. చివరికి దొరికిపోతాననే భయంతో వాష్ రూమ్ వెళ్లి బాత్‌రూమ్ కమోడ్‌లో వేసి ఫ్లష్ చేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు.