
ఓ యువకుడు వరుసకు వదిన అయ్యే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. అయితే అదే మహిళ మరో యువకుడితో చనువుగా ఉంటోందనే అనుమానం అతడికి కలిగింది. దీంతో అతడు ఆ ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలో జరిగింది.
విషాదం : బంధువు కర్మకాండకు వచ్చి.. క్వారీ గుంతలో మునిగి ముగ్గురు మృతి...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం కోదడ్డపనస గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళకు భాస్కరరావు అనే వ్యక్తితో 18 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల రామరావు అనే వ్యక్తితో కొంత కాలం కిందట వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడు ఆమెకు వరుసగా మరిది అవుతాడు.
ఘోరం.. భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే ?
అయితే ఆ మహిళ అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల సంతోష్ అనే వ్యక్తితో కొన్ని రోజుల సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం రామరావుకు తెలిసింది. సంతోష్ తో కూడా ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందని అతడు అనుమానించాడు. దీంతో వారిపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వంశధార కెనాల్ లో స్నానం చేస్తున్న సంతోష్ ను హతమార్చాడు.
తరువాత ఆ కెనాల్ కు దగ్గరలోనే పని చేస్తున్న మహిళను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడి పరారీలో ఉన్నాడని, గాలింపు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.