కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతూ... తాడేపల్లి నివాసంలో రెండు మృతదేహాలు (వీడియో)

Published : Jul 29, 2021, 02:25 PM ISTUpdated : Jul 29, 2021, 02:27 PM IST
కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతూ... తాడేపల్లి నివాసంలో రెండు మృతదేహాలు (వీడియో)

సారాంశం

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ఇంట్లో గుర్తుతెలియని రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 

అమరావతి:  గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘోర ఘటన బయటపడింది. ఓ ఇంట్లో రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో బయటపడ్డాయి. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పాక్షికంగా కుళ్లిన రెండు మృతదేహాలను గుర్తించారు.  

లోపలి నుండి తాళం వేసి వుండటంతో తలుపులు బద్దలుకొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు మృతదేహాలు మంచంపై వున్నాయి. రెండు మూడు రోజుల క్రితమే వారిద్దరు ఆత్మహత్య చేసుకుని వుంటారని... అందువల్లే మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు భార్యభర్తలు అయివుంటారని అనుమానిస్తున్నారు. వీరిద్దరు ఆత్మహత్య చేసుకుని వుంటారని అనుమానిస్తున్నారు. 

వీడియో

రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోస్టు మార్టం రిపోర్ట్ వస్తే వారిది ఆత్మహత్యా? హత్యా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu