నాన్న పార్టీ మారినా.... నేను మారను.. టీజీ భరత్

By telugu teamFirst Published Jun 22, 2019, 7:55 AM IST
Highlights

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్... రెండు రోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తన తండ్రి పార్టీ మారినా.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ తేల్చిచెప్పారు.

రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్... రెండు రోజుల క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తన తండ్రి పార్టీ మారినా.. తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ తేల్చిచెప్పారు.తండ్రి ఒక పార్టీలో.. తనయుడు మరో పార్టీలో కొనసాగాలనుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

రాష్ట్రం విడిపోకముందు టీజీ వెంకటేష్.. కాంగ్రెస్ నేతగా ఉండేవారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 జరిగిన ఎన్నికల్లో కాంగ్రె్‌సను వీడి ఆయన టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీజీ ఓటమి చెందారు. టీడీపీ అధినేత చంద్రబాబు టీజీని రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత తన వారసుడిగా తనయుడు టీజీ భరత్‌ను రాజకీయ అరంగేట్రం చేయించారు.

మొన్న జరిగిన ఎన్నికల్లో టీజీ భరత్ కి టికెట్ కూడా టీడీపీ కేటాయించింది. అయితే.. స్వల్ప ఓట్ల తేడాతో భరత్ ఓడిపోయారు. తాజా రాజకీయ పరిణామాలతో టీజీ వెంకటేష్.. బీజేపీ గూటికి చేరారు. ఈ క్రమంలో భరత్ కూడా పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై భరత క్లారిటీ ఇచ్చారు.

‘‘పార్టీని వీడే ముందు నాన్న నాతో ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే నేను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పాను. రాజకీయంగా అది నీ వ్యక్తిగత విషయమని నాన్న అన్నారు. నాన్న బీజేపీలో చేరిన వెంటనే నేను మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే్‌షకు ఫోన్‌ చేసి తాను టీడీపీలోనే కొనసాగుతానని, పార్టీ వీడే ఆలోచన లేదని చెప్పాను. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. తిరిగి రాగానే అమరావతికి వెళ్లి లోకే్‌షతో పాటు చంద్రబాబును కూడా కలుస్తాను. 2019 ఎన్నికలో ఎంత ఒత్తిడి ఉన్నా నాపై నమ్మకంతో చంద్రబాబు టికెట్‌ ఇచ్చారు. పార్టీలో కొనసాగుతూ కార్యకర్తలకు అండగా ఉంటా.’’ అని తేల్చిచెప్పారు. 
 

click me!