ఏపీని ప్రత్యేకంగా చూడండి, హోదా ఇచ్చి ఆదుకోండి: కేంద్రాన్ని కోరిన బుగ్గన

By Nagaraju penumalaFirst Published Jun 21, 2019, 9:31 PM IST
Highlights

రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన ఆర్థిక లోటు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల పెండింగ్ పై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.  
 
న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా చూడాలని కోరినట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీకి కేంద్రం నుంచి రావల్సిన నిధులను ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 

రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన ఆర్థిక లోటు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు నిధుల పెండింగ్ పై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్ లో పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమస్యలు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం పూర్తి చేయడానికి నిధులను ఇవ్వాలని సమావేశంలో కోరినట్లు తెలిపారు.  

అలాగే పీఎం కిసాన్ సాయం పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రైతులు, స్వయం సహాయక బృందాలకు ఇచ్చే సున్నా వడ్డీ భారాన్ని కేంద్రమే భరించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. 

click me!