మేకపాటి, వినయ్ మధ్య సవాళ్లు: ఉదయగిరి బస్టాండ్ వద్ద టెన్షన్, భారీగా పోలీసుల మోహరింపు

By narsimha lodeFirst Published Mar 31, 2023, 9:54 AM IST
Highlights

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో  టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా  బస్టాండ్  సెంటర్ లో  వినయ్  కుమార్  బైఠాయించారు.

నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని  ఉదయగిరిలో  శుక్రవారంనాడు  టెన్షన్  వాతావరణం నెలకొంది.    ఉదయగిరి  బస్టాండ్  సెంటర్  కు ఇవాళ  
 ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని   రావాలని  వైసీపీ నేత  వినయ్ కుమార్ రెడ్డి సవాల్  విసిరారు.  దీంతో  టెన్షన్ వాతావరణం నెలకొంది. 

బెంగుళూరు  నుండి  ఉదయగిరికి చేరుకున్న  ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  గురువారంనాడు  ఉదయగిరి బస్టాండ్  సెంటర్ లో  కుర్చీ వేసుకొని  కూర్చున్నాడు.   తనకు  సవాల్ విసిరిన  నేతలను  రావాలని  మేకపాటి  చంద్రశేఖర్ రెడ్డి  కోరారు.  సుమారు  గంటన్నర పాటు  మేకపాటి  చంద్రశేఖర్ రెడ్డి బస్టాండ్  సెంటర్ లో   కూర్చున్నాడు. తనకు సవాల్  విసిరిన నేతలను  రావాలని  చంద్రశేఖర్ రెడ్డి  కోరారు.

వైసీపీ నేతలు  ఎవరూ  రాకపోవడంతో  ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లిపోయారు.  నిన్న  మేకపాటి  చంద్రశేఖర్ రెడ్డి  బస్టాండ్  సెంటర్ నుండి వెళ్లిపోయిన  తర్వాత  వైసీపీ నేత వినయ్ కుమార్  బస్టాండ్  సెంటర్ కు వచ్చారు. తాను భోజనానికి  వెళ్లిన  సమయంలో  ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వచ్చాడని  వినయ్ కుమార్ చెబుతున్నారు. తమ సవాల్ కు కట్టుబడి ఉన్నట్టుగా  వినయ్ కుమార్  చెబుతున్నారు.   ఇవాళ  ఉదయం నుండి  ఉదయగిరి  బస్టాండ్  సెంటర్  వినయ్ కుమార్ కుర్చీ వేసుకొని  కూర్చొన్నాడు.   బస్టాండ్  సెంటర్ కు రావాలని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వినయ్ కుమార్ సవాల్  విసిరారు. 

ఈ సవాల్ పై  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  ఎలా స్పందిస్తారో చూడాలి. ఉదయగిరి అసెంబ్లీ  నియోజకవర్గంలో  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  పర్యటిస్తే తరిమికొడుతామని వైసీపీ నేతలు పునరుద్థాటించారు.  

also read:ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి, సెంటర్‌లో కుర్చీ వేసుకుని కూర్చొన్న మేకపాటి

ఈ పరిస్థితుల నేపథ్యంలో  ఉదయగిరి బస్టాండ్  సెంటర్ వద్ద  భారీగా పోలీసులు మోహరించారు. మేకపాటి చం్రశేఖర్ రెడ్డి  వర్గీయులు  బస్టాండ్  సెంటర్ కు వస్తే  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసులు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీడీపీకి  ఓటు వేశారని  ఉదయగిరి ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై  వైసీపీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు  ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై  వైసీపీ  సస్పెన్షన్ వేటేసింది.   వైసీపీ  సస్పెన్షన్ వేటు వేయడంతో  చంద్రశేఖర్ రెడ్డిపై  వైసీపీ  నేతలు  విమర్శలు  గుప్పిస్తున్నారు.  చంద్రశేఖర్ రెడ్డిని  నియోజకవర్గానికి వస్తే  తరిమివేస్తామని  వార్నింగ్  ఇస్తున్నారు.  వైసీపీ నేతల వార్నింగ్ ల నేపథ్యంలో  నిన్న నియోజకవర్గానికి  వచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  వైసీపీ నేతలకు  సవాల్ పై  స్పందించారు. తనను తరిమి కొట్టాలని  ఆయన  బస్టాండ్ సెంటర్ లోనే  కుర్చీ వేసుకుని కూర్చున్నారు. 

click me!