బెజవాడ బ్రేకింగ్ : ఇంద్రకీలాద్రిపై టెన్షన్.. టెన్షన్

First Published Jun 1, 2018, 11:16 AM IST
Highlights

నాయీ బ్రాహ్మణుడిపై చేయి చేసుకున్న పాలకమండలి సభ్యుడు

బెజవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దేవాలయంలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించారంటూ క్షవర వృత్తిదారులంతా ఆందోళనకు దిగారు. దీంతో గుట్టపై టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాలు చదవండి.

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయ పాలకమండలి సభ్యుడు పెంచలయ్య క్షవరకుడిపై చేయి చేసుకున్నట్లు నాయీ బ్రాహ్మణులు ఆరోపిస్తున్నారు. పెంచలయ్య తీరు దుర్గ గుడిలో వివాదావివాదస్పదంగా మారిందని చెబుతున్నారు. ఆయన క్యూలైన్లో భక్తులను సైతం అవమానపరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

పాలకమండలి చైర్మెన్ గౌరంగబాబు చెప్పినా పెంచలయ్య తన వ్యవహారశైలి మార్చుకోలేదని అంటున్నారు. పెంచలయ్య వ్యవహారశైలిపై ఆలయ ఉద్యోగులు సైతం ఆగ్రహం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. బంధువులకు, స్నేహితులకు పాలకమండలి సభ్యులు పెద్దపీట వేస్తున్నట్లు విమర్శలున్నాయి.

నాయి బ్రాహ్మణుడిపై చేయిచేసుకున్న పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నాయిబ్రాహ్మణలు. అయితే నాయిబ్రాహ్మణులకు నచ్చజెప్పెందుకు ప్రయత్నిస్తోన్న ఆలయ అధికారులు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. దుర్గ గుడిలో టెన్షన్ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతోంది.

click me!