ప్రముఖ సాహితీవేత్త ద్వానా శాస్త్రి కన్నుమూత

By telugu teamFirst Published Feb 26, 2019, 8:31 AM IST
Highlights

ద్వానా శాస్త్రి పూర్తి పేరు ద్వాదశి నారాయణ శాస్త్రి. ద్వానా శాస్త్రిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఆయన తెలుగు సాహిత్య చరిత్ర వంటి పలు గ్రంథాలు రచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆయన రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి.

హైదరాబాద్: ప్రముఖ రచయిత, సాహితీవేత్త ద్వానా శాస్త్రి కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన వయస్సు 72 ఏళ్లు.

ద్వానా శాస్త్రి పూర్తి పేరు ద్వాదశి నారాయణ శాస్త్రి. ద్వానా శాస్త్రిగా ఆయన ప్రసిద్ధి పొందారు. ఆయన తెలుగు సాహిత్య చరిత్ర వంటి పలు గ్రంథాలు రచించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆయన రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయి. 

1970లో రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన ద్వానాశాస్త్రి విమర్శనా సాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశారు. వివిధ పత్రికలు, పుస్తకా ల్లో వేలాది వ్యాసాలూ రాశారు. 

సమాధిలో స్వగతాలు-వచ న కవిత, వాఙ్మయ లహరి- వ్యాససంపుటి, సాహిత్య సాహి త్యం - వ్యాస సంపుటి, మారేపల్లి రామచంద్ర కవితా సమీక్ష-ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం, ద్రావిడ సాహిత్య సేతువువ్యాస ద్వాదశి, వ్యాస సంపుటి అక్షర చిత్రాలు, అరుదైన ఛాయాచిత్రాలు సాహిత్య సంస్థలు - పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసం, ఆం ధ్ర సాహిత్యం, మన తెలుగు తెలుసుకుందాం, ద్వానా కవితలు, శతజయంతి సాహితీమూర్తులు సంపాదకత్వం,తెలుగు సాహిత్య చరిత్ర, నానీలలో సినారె, సినారె కవిత్వంలో ఉక్తులు, సూక్తులు వంటి పలు గ్రంథాలను ఆయన వెలువరించారు.

click me!