ప్లాస్టిక్‌పై , ఫ్లెక్సీల మీద నిషేధం పవన్ బర్త్‌డే వరకేనా : జగన్‌పై వంగలపూడి అనిత సెటైర్లు

By Siva KodatiFirst Published Aug 28, 2022, 3:53 PM IST
Highlights

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద నిషేధం కూడా పవర్‌స్టార్ బర్త్ డే వరకు వుండి.. తర్వాత మాయమవుతుందా అని ఆమె ప్రశ్నించారు. 
 

రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. తాజాగా తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా టికెట్ రేట్ల మాదిరిగానే అవుతుందా అని అనిత ప్రశ్నించారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకు తగ్గిన సినిమా టికెట్ రేట్లు.. ఆ తర్వాత మళ్లీ పెరిగాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద నిషేధం కూడా పవర్‌స్టార్ బర్త్ డే వరకు వుండి.. తర్వాత మాయమవుతుందా అని అనిత సెటైర్లు వేశారు. ప్లాస్టిక్ కంటే ముందు జగన్‌ను బ్యాన్ చేయాలని.. లేదంటే ఏపీయే బ్యాన్ అయ్యే పరిస్ధితి వస్తుందని ఆమె హెచ్చరించారు. 

అంతకుముందు జగన్ ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ప్లాస్టిక్ నిషేధం దిశగా జగన్ ఇచ్చిన పిలుపు వెనుక మరో కారణం వుందంటూ గోరంట్ల సెటైర్లు వేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు ఉందని ప్లాస్టిక్ ఫ్లెక్సీ లు బ్యాన్ చేస్తున్న జగన్ గారిని చూస్తుంటే హలొబ్రదర్ సినిమా లో విలన్ గుర్తుకు వస్తున్నాడు. అంటూ బుచ్చయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ALso REad:హలో బ్రదర్ సినిమాలో విలన్‌లా జగన్.. ఏపీలో ప్లాస్టిక్ నిషేధంపై బుచ్చయ్య చౌదరి సెటైర్లు

కాగా.. శుక్రవారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఇక నుండి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉండబోవన్నారు. ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసిన ఫ్లెక్సీలనే ఉపయోగించాలని జగన్ కోరారు. తిరుమలలో ప్లాస్టిక్ లేకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని... 2027 చివరి నాటికి  ప్లాస్టిక్ లేని రాష్ట్రంగా మార్చుతామని సీఎం జగన్ ప్రకటించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే అబివృద్దిని సాధించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. 

 

ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీల బ్యాన్ కూడా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం లానేనా? పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వరకూ తగ్గిన టికెట్ రేట్లు ఆ తర్వాత మళ్ళీ పెరిగినట్లు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల మీద బ్యాన్ కూడా గారి పుట్టినరోజు వరకూ ఉండి ఆ తర్వాత మాయమవుతుందా?

— Anitha Vangalapudi (@Anitha_TDP)
click me!