సీపీఎస్ కమిటీతో ప్రభుత్వం చర్చించాలి:బొప్పరాజు డిమాండ్

By narsimha lode  |  First Published Aug 28, 2022, 2:58 PM IST

సీపీఎస్ కమిటీతో ప్రభుత్వం చర్చించాలని  ఏపీఆర్ఎస్ఏ  రాష్ట్ర  అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పాత పెన్షన్ ఇస్తామని చెప్పడం సరైంది కాదన్నారు. సెప్టెంబర్ 1 వ తేదీన నిరసన కార్యక్రమాలకు పిలునిచ్చిన విషయం తెలిసిందే. 


హైదరాబాద్: సీపీఎస్ కమిటీతో ప్రభుత్వం చర్చించాలని  ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు  వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.  పాత పెన్షన్ ఇస్తామని చర్చలకు పిలిచి ముగింపునకు  పాల్పడడం సరైంది కాదన్నారు.సీపీఎస్ రద్దు కోసం అందరూ కలిసి రావాలన్నారు. ప్రతి సంవత్సరం చేసినట్టుగానే సెప్టెంబర్ 1న నిరసన కార్యక్రమాలు చేస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.

విపక్షంలో ఉన్న సమయంలో ఉద్యోగుల సీపీఎస్ ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ సంఘాలు ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఛలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా సీఎం ఇంటిని ముట్టడించాలని  ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.అయితే  ఉద్యోగ సంఘాలు చలో విజయవాడకు పిలుపునివ్వడాన్ని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు బట్టారు. 

Latest Videos

undefined

సీపీఎస్ రద్దుకు బదులుగా ప్రత్యామ్నాయ పెన్షన్ విదానాన్ని ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చింది. సీపీఎస్ రద్దునే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రత్యామ్నాయ పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

సెప్టెంబర్ 1వ తేదీన ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది. ఉద్యోగ సంఘాలు డిమాండ్ల విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెబుతున్నారు. తమకు ఇచ్చిన హామీలను  నెరవేర్చాలని  ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. సీపీఎస్ ను రద్దు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రస్తావించకుండా ప్రత్యామ్నాయ పెన్షన్ విధానం వల్ల ప్రయోజనం లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

click me!