telugua akademi:సాయికుమార్ బ్యాచ్ ట్విస్ట్, ఏపీలో రూ. 15 కోట్లు స్వాహా

By narsimha lode  |  First Published Oct 13, 2021, 2:53 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ సంస్థల్లో కూడ రూ. 15 కోట్లను సాయికుమార్ బ్యాచ్ స్వాహా చేసిందని తెలంగాణ పోలీసులు గుర్తించారు. తెలుగు అకాడమీకి చెందిన సాయికుమార్ బ్యాచ్ ఈ నిధులను స్వాహా  చేశారని ఏపీ అధికారులకు సమాచారం పంపారు.



అమరావతి: తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్వాహా చేసిన ముఠా ఏపీ రాష్ట్రానికి చెందిన రెండు కీలకమైన సంస్థల్లో నిధులను కొల్లగొట్టారని గుర్తించారు పోలీసులు.ఈ మేరకు ఏపీ అధికారులకు సీసీఎస్ పోలీసులు సమాచారం ఇచ్చారు.telugu akademi స్కామ్‌లో నిధులను కొల్లగొట్టిన saikumar ముఠా ap ware housing corporation,ap oil federation ల నుండి రూ. 15 కోట్ల  ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టారు.

ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ నుండి రూ. 9 కోట్లు, ఏపీ ఆయిల్ ఫెడ్ నుండి రూ. 6 కోట్లను కొల్లగొట్టారని అధికారులు గుర్తించారు. గిడ్డంగుల శాఖకు రూ. 32 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లున్నాయి.అయితే bhavanipuram iobలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ.9.60 లక్షలను నిందితులు డ్రా చేశారని ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ ఎండీ తెలిపారు. ఐఓబీ బ్యాంకుల్లోని 34 ఫిక్స్‌డ్ డిపాజిట్లలో నగదు గల్లంతైందని గుర్తించామని ఎండీ చెప్పారు.

Latest Videos

ఈ విషయమై బ్యాంకు అధికారులతో వేర్ హౌసింగ్ కార్పోరేషన్ అధికారులు మాట్లాడారు. దీంతో బ్యాంకు అధికారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల గల్లంతుపై విచారణ చేస్తున్నారు.తెలంగాణ అకాడమీలో నిధులు కొల్లగొట్టిన నిందితులే ఫిక్స్‌డ్ డిపాజిట్లను స్వాహా చేశారని తెలంగాణ పోలీసులు తమకు సమాచారం అందించారని  వేర్ హౌసింగ్ అధికారులు తెలిపారు.

also read:చెన్నై జైల్లో ‘ఎఫ్ డి స్కామ్ పాఠాలు’... తెలుగు అకాడమీ కేసులో సూత్రధారి విచారణలో విస్తుపోయే వాస్తవాలు...

ఫిక్స్‌డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ కావడానికి ముందే  నిధులు తరలించారని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ ప్రకటించారు.ఈ విషయమై అంతర్గత విచారణ చేస్తున్నామన్నారు. అంతేకాదు  నిధుల గల్లంతుపై  దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని  ఆయన తెలిపారు. తమకు తెలియకుండానే ఈ నిధులను డ్రా చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులను ఈ విషయమై ఎండీ ప్రశ్నించారు. దీంతో ఈ విషయమై నిందితులకు బ్యాంకు ల నుండి ఎవరైనా సహకరించారా అనే కోణంలో బ్యాంకు అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణలోని తెలుగు అకాడమీలో రూ.64.5 కోట్లను సాయికుమార్ బ్యాచ్ కొల్లగొట్టింది.  ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో  తొమ్మిది మందని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.సాయికుమార్ సహా పలువురు నిందితులు ఈ నిధులను పంచుకొన్నారు. సాయికుమార్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రియల్ ఏస్టేట్ లో పెట్టుబడులు పెట్టాడు. అయితే ఈ భూములు వివాదాల్లో ఉన్నాయని సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ కు నిందితులు ఎలా ప్రణాళిక వేశారనే విషయమై సీసీఎస్ పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై ఆధారాలను సేకరిస్తున్నారు. 

click me!