ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సింహవాహిని దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని డిజిపి గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు.
విజయవాడ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ. సింహవాహిని అలంకారియైన కనదుర్గమ్మను బుధవారం ఆంధ్ర ప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు.
అమ్మవారిని దర్శనంకోసం indrakeeladri పైకి విచ్చేసిన dgp goutham sawang కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. durga devi అలంకారంలోని అమ్మవారికి దర్శించుకున్న తర్వాత ఆలయ అర్చకులు డిజిపికి ఆశీర్వచనం అందించారు. డిజిపకి దుశ్శాలువా కప్పి, పూలదండ వేసి ఆశీర్వదించారు. అలాగే ఆలయ ఈవో డిజిపి సవాంగ్ కు ప్రసాదం అందించి అమ్మవారి ఫోటోను బహూకరించారు.
undefined
అనంతరం డిజిపి మాట్లాడుతూ... దసరా navaratri celebrations లో భాగంగా దుర్గాదేవి రూపంలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని దుర్గమ్మను కోరుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కూడా కొన్ని కోరికలు అమ్మవారిని కోరుకున్నట్లు సవాంగ్ తెలిపారు.
వీడియో
అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాల్లో బందోబస్తు కోసం నియమించిన తమ పోలీస్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని డిజిపి కితాబిచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు కూడా బాగున్నాయని డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు.
video అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ... ఇంద్రకీలాద్రిపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఇక నిన్న మంగళవారం కనకదుర్గమ్మకురాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారంగా అర్చకులు సీఎం జగన్ కు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం జగన్ వేద మంత్రాల సాక్షిగా silk robes అమ్మవారికి సమర్పించారు.
కనకదుర్గమ్మ అమ్మవారు నిన్న సరస్వతీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సీఎం జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం జగన్ వెంట ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయశాఖాధికారులు, విజయవాడ మున్సిపల్ అధికారులు కూడా ఉన్నారు.
సీఎం జగన్ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిన్న మూలా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొన్నారు.