
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) దాఖలు చేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్‌కు నెంబర్ కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన క్విడ్ ప్రోకో కేసుపై తదుపరి విచారణ చేపట్టాలని రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై సీబీఐ పదేళ్ల క్రితమే విచారణ ప్రారంభించగా.. ఇప్పటికే ఈ కేసులో 11 చార్జిషీట్లు దాఖలు చేసిందన్నారు. వైఎస్ జగన్ కేసులో పలు అంశాలపై ఈడీ, సీబీఐ విచారణ జరపలేదని ఎంపీ రఘరామకృష్ణరాజు పిల్‌లో ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలను దర్యాప్తు సంస్థ విస్మరించిందని.. వాటిపై కూడా విచారణ చేపట్టేలా హైకోర్టు సీబీఐని ఆదేశించాలని కోరుతున్నట్టుగా పిల్‌లో పేర్కొన్నారు.
అయితే పలు అభ్యంతరాలను కారణంగా చూపుతూ హైకోర్టు కార్యాలయం పిల్‌ను అనుమతించలేదు. అయితే పిల్ విచారణ అర్హతను తేల్చాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం నేడు పేర్కొంది.