సినిమా టికెట్ల ధరలపై ఏపీ సర్కార్ కొత్త జీవో: హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి

By narsimha lode  |  First Published Mar 8, 2022, 10:52 AM IST

సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. 


హైదరాబాద్: Cinema టికెట్ల ధరలపై AP Government కొత్త జీవో విడుదల చేయడంపై సినీ నటుడు Chiranjeevi  స్పందించారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై సోమవారం నాడు సాయంత్రం కొత్త జీవోను జారీ చేసింది.ఈ జీవోపై మంగళవారం నాడు స్పందించారు. ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల విషయమై  ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతానని చిరంజీవి చెప్పారు.

కార్పోరేషన్లలోని  నాన్ ఏసీ థియేటర్లలో  ప్రీమియం టికెట్  ధర రూ.60లుగా,  నాన్ ప్రీమియం టికెట్ రూ.40గా నిర్ణయించారు.
ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100 గా నిర్ణయం తీసుకొన్నారు. 
మల్టీప్లెక్సులలో రెగ్యులర్  టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250 గా నిర్ణయించారు. 

Latest Videos

undefined

 మున్సిపాలిటీల్లోని నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.50గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30గా నిర్ణయం తీసుకొన్నారు. ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో  ప్రీమియం టికెట్ ధర రూ.80గా, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60గా నిర్ణయించారు.స్పెషల్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80గా మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250గా నిర్ణయించారు.
  
నగర పంచాయితీ, గ్రామ పంచాయితీల్లో నాన్ ఏసీ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20, ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లలో ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లులో ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70, మల్టీప్లెక్సులలో రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.గా నిర్ణయించారు.ఈ టికెట్ ధరలకు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. 

భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చారు. రూ.100 కోట్లు, అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కే చిత్రాలకు  ఇది వర్తిస్తుంది. అయితే ఏపీ సర్కారు ఇక్కడో షరతు విధించింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చిన్న సినిమాలు ఐదో షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.
 


  

click me!