విజయవాడలో కోగంటి సత్యం అనుచరుడు టెక్కం శ్యాం అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

Published : Jul 16, 2023, 09:22 AM ISTUpdated : Jul 16, 2023, 09:25 AM IST
విజయవాడలో కోగంటి సత్యం అనుచరుడు  టెక్కం శ్యాం అనుమానాస్పద మృతి:  పోలీసుల దర్యాప్తు

సారాంశం

విజయవాడలో కోగంటి సత్యం ప్రధాన అనుచరుడు  టెక్కం శ్యాం అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.  శ్యాం మృతిపై  కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం  చేస్తున్నారు.

విజయవాడ: విజయవాడలో కోగంటి సత్యం  ప్రధాన అనుచరుడు టెక్కం శ్యాం  అనుమానస్పదస్థితిలో శనివారం నాడు మృతి చెందారు.  టెక్కం శ్యాం మృతిపై  కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు. టెక్కం శ్యాంపై  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు  కేసులు నమోదయ్యాయి.

శనివారంనాడు  శ్యాం భార్య  ఇంట్లో లేని సమయంలో  శ్యాం  అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. శ్యామ్ ను హత్య చేసి ఉంటారని  శ్యాం  భార్య , సోదరుడు అనుమానిస్తున్నారు.ఈ విషయమై  పోలీసులకు  ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై  పోలీసులు  అనుమానాస్పద మృతిగా  కేసు నమోదు  చేసి దర్యాప్తు  చేస్తున్నారు.  టెక్కం శ్యాం  మృతదేహన్ని పోలీసులు  పోస్టుమార్టం నిమిత్తం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్యాం మృతికి గల కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

విజయవాడకు చెందిన కోగంటి సత్యంపై కూడ పలు కేసులు నమోదయ్యాయి. సత్యం అనుచరుడిగా ఉన్న   శ్యాం అనుమానాస్పద మృతి ప్రస్తుతం  కలకలం రేపుతుంది.   శ్యాం ఎలా మృతి చెందారనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలనుందని పోలీసులు అభిప్రాయంతో ఉన్నారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dasara Holidays 2026 : దసరా హాలిడేస్ అక్టోబర్ 25 వరకు పొడిగిస్తారా? 13 కాదు 16 రోజులు సెలవులేనా?
Vallabhaneni Vamsi పై తీవ్రంగా కంట్రోల్ తప్పిన Yarlagadda Venkatrao | Local Body Elections | Asianet