టీడీపీని బిజెపిలో విలీనం చేస్తాం: జెసి సంచలన వ్యాఖ్యలు

Published : Jul 11, 2019, 10:58 AM IST
టీడీపీని బిజెపిలో విలీనం చేస్తాం: జెసి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

తాము ప్రస్తుతం కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని, గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని,  ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామని జెసి అన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని ఆయన అన్నారు.

అనంతపురం : త్వరలోనే తమ పార్టీ బిజెపిలో విలీనమవుతుందని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని, బిజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామని ఆయన అన్నారు. ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తాము ప్రస్తుతం కొత్తగా బీజేపీతో జతకట్టడం లేదని, గత ఐదేళ్ల టీడీపీ పాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామని,  ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామని జెసి అన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే కాదు, ఏకంగా టీడీపీ మొత్తం బీజేపీతో కలిపిపోతుందని ఆయన అన్నారు. 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మాజీ సీఎం చంద్రబాబు సలహాలు ఎంతో అవసరమని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాడిపత్రిలో పర్యటించిన నేపథ్యంలోజేసీ ప్రభాకర్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

ఇటీవలే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ చేరిన విషయం తెలిసిందే. జెసి బ్రదర్స్ కు బిజెపి నుంచి ఆహ్వానం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?