
ఇంతవరకు కమ్మ వారి పార్టీ గా పేరుబడిన తెలుగుదేశం పార్టీకి ఒక రెడ్డి అధ్యక్షుడువుతాడనే వార్త అమరావతిలో గుప్పు మనింది.
తెలుగుదేశం పార్టీకి అంటుకున్న కులం రంగు కడిగేసేందుకు పార్టీ జాతీయ అధ్కక్షుడు చంద్రబాబునాయుడు యోచిస్తున్నాడని, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ టిడిపికి ఒక రెడ్డి నాయకుడు అధ్యక్షుడిని చేసి ఆయన చరిత్రలో మిగిలిపోవాలనుకుంటున్నారట.
రెడ్డి అంటే యాంటి టిడిపి అని అర్థం. పూర్వం రెడ్డి అంటే కాంగ్రెస్ అనే వారు. ఇపుడు వైపిసి అని కూడా కొందరు చెబుతారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం వచ్చిందని పైకి ఐడియాలాజికల్ గా వాదించిన టిడిపి పుట్టింది రెడ్లకు వ్యతిరేకంగానే .
అందువల్ల ఇలాంటి టిడిపికి రాయలసీమ రెడ్డినొకరిని అధ్యక్షుని చెేసి కుల వాదులంతా అవాక్యయ్యేలాచంద్రబాబు నాయుడు మాయ చేస్తారనేది అమరావతిలో వినవస్తున్న తాజా కబురు.
ఎందుకంటే, ఇపుడు రెండురాష్ట్రాలలో టిడిపి అధ్యక్షులు బిసిలే. తెలంగాణా అధ్యక్షుడు ఎల్ రమణ పద్మశాలి. ఆంధ్రా టిడిపి అధ్యక్షుడు కళా వెంకటరావు తూర్పు కాపు. కళా మరదలు మృణాళిని ఇపుడు మంత్రి వర్గంలో సభ్యురాలు. ఆమె ను తొలగించి కళా వెంకటరావుని (గతంలో ఆయన హో మంత్రి) మంత్రి ని చేస్తారని అంటున్నారు. అపుడు ఖాళీ అయ్యే ఎపి టిడిపి అధ్యక్ష పదవికి చంద్రబాబుకి, చిన్న బాబుకి బాగా బలంగా లాయల్ గా ఉండే రాయలసీమ రెడ్డిని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతు ఊందని ఈ వాదన చేస్తున్న వర్గీయులు అంటున్నారు.
టిడిపి లాయల్ రెడ్లకు రాయలసీమలో కొదవ లేదు. జిల్లాకో అర డజన్ గ్యారంటీ గా ఉన్నారు. ఎవరినయినా చేయవచ్చు. ఎందుకంటే పేరుకు రెడ్డి అధ్యక్షుడయినా, వోనరు మాత్రం కమ్మవారే కదా.
ఈ విషయం మీద విచారిస్తే, ఆదివారం నాడు స్పష్టత వస్తుందని నాయకుడొకరు ‘ఏషియా నెట్ ’ కు క్లుప్తంగా సమాధానమిచ్చారు.
ఇది రాయలసీమ రెడ్లను ఆకట్టుకునే వ్యూహమట.