చేతకాక చంద్రబాబుపై పడి ఏడవడం మీ దురలవాటు: వైసీపీపై అనురాధ ఫైర్

Published : Jul 02, 2019, 07:33 PM IST
చేతకాక చంద్రబాబుపై పడి ఏడవడం మీ దురలవాటు: వైసీపీపై అనురాధ ఫైర్

సారాంశం

వైసీపీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబును విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబుపై కక్ష సాధింపు పనిలో పడి విత్తనాల పంపిణీని, సంక్షేమాన్ని గాలికొదిలేస్తారా? అని నిలదీశారు. అన్నింటికి చంద్రబాబుపై పడి ఏడవడం వైసీపీ నేతల దురలవాటని అనురాధ విమర్శించారు.

విజయవాడ: వైయస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. వైసీపీ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విత్తనాల సంక్షోభానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ నేతలు మాటల దాడి చేయడం దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు. 

విత్తనాలు సరఫరా చేయడం చేతాకక వైసీపీ నిందలు చంద్రబాబుపై మోపుతోందని మండిపడ్డారు. వైసీపీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబును విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

చంద్రబాబుపై కక్ష సాధింపు పనిలో పడి విత్తనాల పంపిణీని, సంక్షేమాన్ని గాలికొదిలేస్తారా? అని నిలదీశారు. అన్నింటికి చంద్రబాబుపై పడి ఏడవడం వైసీపీ నేతల దురలవాటని అనురాధ విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్