
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి విషమంగానే వుందన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న శరీరంలో బ్లాక్స్ ఎక్కువగా వున్నాయన్నారు. ప్రస్తుతానికి యాంజియోగ్రామ్ చేశారని.. అవకాశం వుంటే బెంగళూరుకి ఎయిర్ లిఫ్టింగ్ చేస్తామని బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
ALso REad: అస్వస్థతకు గురైన తారకరత్న: పీఈఎస్ వైద్యులకు చంద్రబాబు ఫోన్, ఆరోగ్య పరిస్థితిపై ఆరా
కాగా.. కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో శుక్రవారం నాడు పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో లోకేష్ తో పాటు తారకరత్న పాల్గొన్నారు. ఈ సమయంలో తారకరత్న ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తొలుత కేసీ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి..అక్కడి నుండి పీఈఎస్ మెడికల్ కాలేజీకి తారకరత్నను తరలించారు. అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ వైద్యులకు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. తారకరత్నకు మెరుగైన వ్యైద్య సహయం అందించాలని చంద్రబాబు కోరారు. తారకరత్నకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతున్నంతసేపు బాలకృష్ణ అక్కడే ఉన్నారు. ఆయన వెంట రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు.