TDP: రాజోలు నుంచి యువగ‌ళం పాదయాత్రను పునఃప్రారంభించనున్న లోకేష్

By Mahesh RajamoniFirst Published Sep 27, 2023, 2:06 PM IST
Highlights

Razole Assembly constituency: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఏపీ-సీఐడీ 14వ నిందితుడిగా చేర్చింది. అయితే, రాజకీయ పగ, ప్రతీకారమే అరెస్ట్‌లో ప్రధానాంశమని టీడీపీ నేతలు పేర్కొంటూ వైఎస్ ఆర్సీసీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి నారా లోకేష్ త‌న యువగ‌ళం పాదయాత్రను పునఃప్రారంభించనున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి.
 

Nara Lokesh-Yuva Galam Padayatra: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 20న (శుక్రవారం) రాత్రి 8.15 గంటలకు తన యువ‌గ‌ళం పాదయాత్రను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 9న చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్టు చేయడంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 29వ తేదీ రాత్రి కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో బయలుదేరిన చోట నుంచి లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తన పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రాష్ట్ర ప్రభుత్వం తనను ఏ-14గా చేర్చిందని నారా లోకేశ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు వల్ల తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ ఎలాంటి డబ్బు, ప్రయోజనాలు అందలేదని లోకేష్ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినైనా అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఢిల్లీలో అలా చేయడం వారి పరిధిలో లేదని లోకేష్ పేర్కొన్నారు. ఈ కేసులో వాస్తవం లేదని తెలిసి కూడా ప్రభుత్వం నిరాధారమైన వదంతులు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లతో తనకు ఉన్న సంబంధం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. తన ఢిల్లీ పర్యటన ప్రధానంగా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపేందుకేనని ఆయన పేర్కొన్నారు.

కాగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఏపీ-సీఐడీ 14వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసులో లోకేష్‌ను నిందితుడిగా చేర్చినట్లు సీఐడీ మంగళవారం కోర్టుకు మెమో దాఖలు చేసింది. అమరావతి ఐఆర్‌ఆర్‌ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఖైదీల రవాణా (పీటీ) వారెంట్‌ కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించనుంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు, నాటి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తదితరులు నిందితులుగా ఉన్నారు.

మాజీ సీఎం చంద్ర‌బాబు, మాజీ మంత్రి పి నారాయణ్‌, మరికొందరు టీడీపీ నేతలకు లబ్ది చేకూరేలా అమరావతి ఐఆర్‌ఆర్‌ అసలు డిజైన్‌ను మార్చారని సీఐడీ ఆరోపించింది. ఐపీసీలోని వివిధ సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసులు నమోదు చేసింది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, రాజకీయ పగ, ప్రతీకారమే అరెస్ట్‌లో ప్రధానాంశమని టీడీపీ నేతలు పేర్కొంటూ వైఎస్ ఆర్సీసీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

click me!