వైసీపీ పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం

Published : Oct 16, 2018, 02:40 PM IST
వైసీపీ పై టీడీపీ ఎంపీ పొగడ్తల వర్షం

సారాంశం

వైసీపీ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పొగడ్తల వర్షం కురిపించారు.

ప్రతిపక్ష పార్టీని, ఆ పార్టీ నేతలని అధికార పార్టీ నేతలు పొగడటం గురించి ఎప్పుడైనా విన్నారా..? అది జరిగే ప్రసక్తే లేదు అనుకుంటున్నారా..? కానీ అదే జరిగింది. వైసీపీ పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు పొగడ్తల వర్షం కురిపించారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. తితలీ’ తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు నడుం బిగించి తమవంతుగా సాయం చేస్తున్నారు. సినీ హీరోలు మొదలుకుని పారిశ్రామికవేత్తల వరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ సోమవారం నాడు కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆ పార్టీ పేర్కొంది.


 
వైసీపీ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తుఫాను బాధితులకు విరాళం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి’’ అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్