ఏపీలోకి రాకుండా తరిమికొడతాం: బీజేపీకి ఎంపీ కేశినేని నాని వార్నింగ్

Published : Oct 22, 2018, 03:22 PM IST
ఏపీలోకి రాకుండా తరిమికొడతాం: బీజేపీకి ఎంపీ కేశినేని నాని వార్నింగ్

సారాంశం

బీజేపీ నేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నిప్పులు చెరిగారు. ఏపీలోకి రాకుండా బీజేపీ నేతలను తరిమికొడతామని గట్టిగా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అంటే బీజేపీకి భయమని ఎద్దేవాచేశారు. 

విజయవాడ: బీజేపీ నేతలపై విజయవాడ ఎంపీ కేశినేని నిప్పులు చెరిగారు. ఏపీలోకి రాకుండా బీజేపీ నేతలను తరిమికొడతామని గట్టిగా హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు అంటే బీజేపీకి భయమని ఎద్దేవాచేశారు. 

అగ్రిగోల్డ్‌ స్కాంపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నాని తప్పబట్టారు. అగ్రిగోల్డ్ స్కాం టీడీపీ హయాంలో జరగలేదని, అయినా బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేయోద్దంటూ ఎస్సెల్‌ గ్రూప్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హుకుం జారీ చేశారని ఆరోపించారు. 

జీవీఎల్‌, కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు అమలయ్యేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. నీతి, నిజాయితీల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. అవినీతిలో టాప్‌లో గుజరాత్‌ ఉంటే  చివర్లో ఏపీ ఉందని కేశినేని నాని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?