జీవీఎల్ వర్సెస్ బుద్దా: ముదురుతున్న వివాదం

Published : Feb 07, 2019, 04:23 PM IST
జీవీఎల్ వర్సెస్ బుద్దా: ముదురుతున్న వివాదం

సారాంశం

బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావుపై  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు.  కేంద్ర మంత్రులకు  విందులు ఇచ్చి పైరవీలు చేసేది జీవీఎల్ నరసింహారావు అని ఆయన ఆరోపించారు.

అమరావతి:బీజేపీ ఎంపీ  జీవీఎల్ నరసింహారావుపై  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు.  కేంద్ర మంత్రులకు  విందులు ఇచ్చి పైరవీలు చేసేది జీవీఎల్ నరసింహారావు అని ఆయన ఆరోపించారు.

గురువారం నాడు అమరావతిలో ఆయన  మీడియాతో మాట్లాడారు.కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో బుద్దా వెంకన్న పాత్ర ఉందని, వెంకన్నతో పాటు  మరికొందరి టీడీపీ నేతల ప్రమేయం ఉందని  కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు  బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు‌పై  బుద్దా వెంకన్న  గురువారం నాడు స్పందించారు. జీవీఎల్ పవర్ బ్రోకర్‌ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.  కేంద్ర మంత్రులకు విందులు ఏర్పాటు చేసి పైరవీలు  చేస్తారని బుద్దా వెంకన్న ప్రకటించారు.

బీజేపీ, వైసీపీకి చెందిన యాక్షన్ టీమ్‌లు తనను టార్గెట్ చేశాయని బుద్దా వెంకన్న ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని  హోం మంత్రిని కోరుతానని చెప్పారు. తన ఆస్తులతో పాటు జీవీఎల్ ఆస్తులపై సీబీఐ విచారణకు తాను సిద్దమని, జీవీఎల్ సిద్దంగా ఉన్నాడా అని ఆయన ప్రశ్నించారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu