లోకేష్ పప్పు అయితే జగన్ ముద్దపప్పా: బుద్దా వెంకన్న

Published : Nov 02, 2019, 01:38 PM ISTUpdated : Nov 02, 2019, 06:46 PM IST
లోకేష్ పప్పు అయితే జగన్ ముద్దపప్పా: బుద్దా వెంకన్న

సారాంశం

సీఎం జగన్ పై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రిని పరోక్షంగా ముద్దపప్పా అంటూ విమర్శలు చేయడంపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సెటైర్లు వేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్ ముద్దపప్పా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై విరుచుకుపడ్డారు. 

శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ ప్రసంగంపై వ్యంగ్యంగా స్పందించారు బుద్దా వెంకన్న. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తూ మీ ముఖ్యమంత్రి  హీరోయిన్ పేర్లు చదువుతున్నారు ఏంటి?ఓహో నిరక్షరాస్యత కి వచ్చిన పాట్లా అంటూ సెటైర్లు వేశారు. 

చూడకుండా ప్రసంగం చేసేవాడు తప్పు మాట్లాడితే మీరు పప్పు అని సంబరపడ్డారు అంటూ మాజీమంత్రి నారా లోకేష్ పై ఆనాడు చేసిన విమర్శలను గుర్తు చేశారు. చూడకుండా చదివితే పప్పు అన్న వైసీపీ మరి చూసి కూడా చడవలేని వాడిని ఏమి అంటారు విజయసాయిరెడ్డి గారు?ముద్ద పప్పు అంటారా?
 అంటూ జగన్ ను పరోక్షంగా ముద్దపప్పు అంటూ సంబోధించారు. 

‪నిరా రక్షత అంటే..నిరక్ష్యరాస్యత‬, ‪‪దీవితాన్ని పణంగా అంటే..జీవితాన్ని అనుకుంటా‬.. ‪‪సంఘసస్కర్తలు అంటే సంఘ సంస్కర్తలు కాబోలు‬.. ‪‬‪కానీ చివర్లో అన్నారు చూడండి..‬‪ఆ 'రాజిక సౌద్దన్నాన్ని'  అని..అద్గది అది మాత్రం అర్దం కాలేదు. మీకు అర్థం అయితే చెప్తారా విజయసాయిరెడ్డి గారు !! అంటూ సెటైర్లు వేశారు బుద్దా వెంకన్న. 

ఇప్పటికే బుద్ధా వెంకన్నపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు విజయసాయిరెడ్డి. బుద్దా వెంకన్న నిరక్షరాస్యుడు అంటూ తిట్టిపోస్తున్నారు. ట్విట్టర్లో బుద్దా వెంకన్న పెట్టే పోస్టులు ఆయన పెడుతున్నారా అంటూ కూడా సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. 

మెుత్తానికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిల మధ్య ట్విట్టర్ వార్ గత కొద్దిరోజులుగా జరుగుతూనే ఉంది. విజయసాయిరెడ్డిని బుద్దా వెంకన్న శకునిమామా అంటూ సంబోధిస్తూ మరీ సెటైర్లు వేస్తుంటారు. 

ఇకపోతే తాజాగా సీఎం జగన్ పై బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉన్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రిని పరోక్షంగా ముద్దపప్పా అంటూ విమర్శలు చేయడంపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. 

అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇచ్చారు. హుజూర్ నగర్ లో టీడీపీకి 1800 ఓట్లు వచ్చాయి, ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. 

తెలంగాణాలో నేను తోపు అని చెప్పుకునే మీ సీఎం వైయస్ జగన్ అసలు అక్కడ పోటీ చేసే ధైర్యం కూడా చెయ్యలేదాయేనంటూ ప్రశ్నించారు. అయినా గతంలో విశాఖపట్నంలో తన తల్లి దారునంగా ఓడిపోయినా, సిగ్గులేకుండా జనాల్లో తిరిగారుగా మరి ఏ మోహం పెట్టుని తిరిగారో గుర్తు లేదా సిగ్గులేని జన్మనెత్తిన వీసారెడ్డిగారు అంటూ ప్రశ్నించారు బుద్దా వెంకన్న. 

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Powerful Speech: పవన్ పవర్ ఫుల్ స్పీచ్ కి జన సైనికులకి పూనకాలే | Asianet News Telugu
గోదావరి గలగల కాదు.. కాలుష్యంతో విలవిల సమీక్ష సమావేశం లో పవన్ సీరియస్ | Asianet News Telugu