మోదీ ఏ మెుహం పెట్టుకుని ఏపీలో అడుగుపెడతావ్: బుద్దా వెంకన్న

Published : Dec 20, 2018, 01:24 PM IST
మోదీ ఏ మెుహం పెట్టుకుని ఏపీలో అడుగుపెడతావ్: బుద్దా వెంకన్న

సారాంశం

ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఏ మెుహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడతారంటూ మోదీపై విరుచుకుపడ్డారు.  హోదాపై స్పష్టమైన ప్రకటన చేశాకే ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. 

విజయవాడ: ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ఏ మెుహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడతారంటూ మోదీపై విరుచుకుపడ్డారు.  హోదాపై స్పష్టమైన ప్రకటన చేశాకే ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. 

గురువారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా రాష్ట్రంపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.కేసీఆర్‌కు మాయమాటలు చెప్పి ఏపీపై ఉసిగొల్పుతున్నారన్నారని మండిపడ్డారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మోదీ శకుని పాత్ర పోషిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రధానిగా మోదీ అసమర్థుడని వ్యాఖ్యానించారు. ఏపీకి మోదీ చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ జనవరి 6న విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా చేయనున్నట్లు బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!