కేసీఆర్ కి డబల్ గిఫ్ట్ లు ఇస్తాం.. బుద్ధా వెంకన్న

Published : Jan 16, 2019, 04:23 PM IST
కేసీఆర్ కి డబల్ గిఫ్ట్ లు ఇస్తాం.. బుద్ధా వెంకన్న

సారాంశం

ఏపీ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా రావొచ్చని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. 

ఏపీ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా రావొచ్చని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఏపీకి వస్తే కేసీఆర్ కి తాము డబల్ గిఫ్ట్స్ ఇస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాదిగా జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ.. చంద్రబాబు చెప్పినట్లే జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ డైరెక్షన్ లో కేసీఆర్, జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. పదవులు, ఆస్తుల పరిరక్షణ కోసం ఏమైనా చేస్తారని ఈ ఘటనతో తేలిపోయిందన్నారు. వైసీపీకి అంతి ఘడియలు దగ్గరపడ్డాయని అభిప్రాయపడ్డారు. జగన్ విదివిధానాలను చూసి పులివెందలలోని ప్రజలు కూడా ఛీ కొడుతున్నారని చెప్పారు.

ఏపీలో కేసీఆర్ విష రాజకీయాలు చేయడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. కేసీఆర్ లాగా.. అక్కడి వాళ్లు ఇక్కడికి.. ఇక్కడి వాళ్లు అక్కడికి రావొద్దని తాము ఎప్పుడూ చెప్పమని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్