మీ ట్రైలర్ లో ఆ హైలైట్స్ మిస్సయ్యాయి: విజయసాయికి అశోక్ బాబ్ కౌంటర్

Arun Kumar P   | Asianet News
Published : Jul 10, 2020, 10:08 PM ISTUpdated : Jul 10, 2020, 10:09 PM IST
మీ ట్రైలర్ లో ఆ హైలైట్స్ మిస్సయ్యాయి: విజయసాయికి అశోక్ బాబ్ కౌంటర్

సారాంశం

ఏపీలో వైసిపి ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్న వీసారెడ్డి... అందులోని హైలెట్స్ ను కూడా వివరించి ఉంటే బాగుండేదని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు.   

గుంటూరు: ఏపీలో వైసిపి ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్న వీసారెడ్డి... అందులోని హైలెట్స్ ను కూడా వివరించి ఉంటే బాగుండేదని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. ట్రైలర్ తోనే వేల కోట్ల ప్రజాధనం దోపిడి చేస్తే మిగిలిన కాలంలో మరెంత దోస్తారో ఏ-2 రెడ్డి చెప్పాలంటూ మండిపడ్డారు.   

''ఏటా రూ. 5వేల కోట్ల జే-ట్యాక్స్ దోపిడీ కోసం 4 రెట్లు పెంచిన మద్యం ధరలతో కొల్లేరైన పేదల కాపురాలు ట్రైలర్ లో కళ్ల ముందు కదలాడుతున్నాయి. అల్లుడికి అధిక రేట్లతో ఆంబులెన్స్ లు కట్టబెట్టి రూ. 307 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మీ దురాశ తొలి ఏడాది ట్రైలర్ లోనే నగ్న దర్శనమిచ్చింది. 4 రెట్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు.. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల మాడు పగులగొట్టి ఇచ్చిన కరెంట్ షాక్ ట్రైలర్ లో ప్రజల కళ్లు బైర్లు కమ్మేలా చేసింది'' అని అన్నారు.

''సిమెంట్-ఇసుక మొదలు రేషన్ సరుకుల వరకు ధరలు పెంచి.. ప్రజలపై మోపిన రూ. 50 వేల కోట్ల బాదుడుతో తేలిన వాతలు మీ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. తొలి ఏడాదే రూ. 87 వేల కోట్ల అప్పు చేసి సగానికి సగం దిగమింగిన మీ అవినీతి ఆకలి కూడా ట్రైలర్ లో కనిపించింది వీసారెడ్డి. మీరు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన మీడియా, ప్రతిపక్షం, ఎన్నికల కమిషనర్, ఉన్నత న్యాయస్థానాలు, చివరకు మీ పార్టీ ఎంపిపైన మీరు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక దాడులు, పెడుతున్న అక్రమ కేసులు తొలి ఏడాది ట్రైలర్ నిండా జుగుప్సాకరంగా దర్శనమిస్తున్నాయి'' అని మండిపడ్డారు. 

read  more   ట్రంప్ నిర్ణయంపై కేంద్రానికి చంద్రబాబు లేఖ: టీడీపీ ఎన్నారై కో ఆర్డినేటర్ రాంప్రసాద్

''మీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, హింసలకు బెదరిన పారిశ్రామికవేత్తలు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరలించిన సీన్ కూడా మీ ట్రైలర్ లో మిస్ కాలేదు. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మిమ్ములను విమర్శిస్తుంటే.. మీ స్థాయి ఎంత దిగజారిందో మీ ట్రైలర్ లో ఎక్కడా కనబడటం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు తీసివేయడానికి ఎంత ఖర్చయిందీ మీ ట్రైలర్ లో లేదు'' అని అన్నారు. 

''చలిచీమల చేతజిక్కిన విషసర్పం సీన్ కూడా మీ ఏడాది ట్రైలర్ లో ఎక్కడా కనిపించలేదు. తొలి ఏడాది ట్రైలర్ లోని దుర్మార్గలతో విసిగి వేసారిన ప్రజలు.. మిగిలిన కాలాన్ని రక్షించుకోవడానికి పోషించబోతున్న చలిచీమల పాత్రను కూడా సినిమాలో చుద్దురు వీసారెడ్డి'' అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో కౌంటరిచ్చారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. 

PREV
click me!

Recommended Stories

Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu
Chandrababu Naidu Interacts with School Students | Chandrababu Visit Schools | Asianet News Telugu