ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. తాళిబొట్లతో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మద్యంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం నాడు కూడా TDP సభ్యులు నిరసనకు దిగారు. ఇవాళ ఏకంగా తాళిబొట్లతోనే టీడీపీ MLAలు నిరసన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు సస్పెన్షన్ కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ AP Assemblyకి హాజరయ్యారు.
ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత Jangareddygudem మరణాలతో పాటు మధ్య నిషేధంపై చర్చించాలని టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలోకి తెచ్చిన తాళిబొట్లతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఈ సమయంలో తమ వైపునకకు స్పీకర్ కన్నెత్తి కూడా చూడలేదని టీడీపీ సభ్యులు ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి టీడీపీ సభ్యులు ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో నిరసనకు దిగుతున్నారు. ఒక్క రోజూ విజిల్స్ వేయగా, మరో రోజు చిడతలు వాయిస్తూ నిరసనకు దిగారు. ఇవాళ తాళిబొట్లతో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వినూత్న నిరసనల పేరుతో విజిల్స్, చిడతలు సభలోకి తీసుకు రావడంపై స్పీకర్ Tammineni Sitaram ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సభ్యుల ప్రవర్తనపై ఆయన మండిపడ్డారు. శాసనసభలో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ కూడా ఇదివరకే టీడీపీ సభ్యులపై స్పీకర్ మండిపడ్డారు.YS Jagan సర్కార్ అవలంభిస్తున్న liquor విధానం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేందుకు తాళిబొట్లను తీసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా టీడీపీ సభ్యులు తెలిపారు.ప్రశ్నోత్తరాల సమయంలో మద్యంపై చర్చకు టీడీపీ సభ్యలు పట్టుబడ్డారు. పోడియం వద్దకు వచ్చి నిరసనకు దిగారు. అయితే స్పీకర్ అంగీకరించకపోవడంతో టీడీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
అంతకు ముందు అసెంబ్లీకి కూడా టీడీపీ ప్రజా ప్రతినిధులు తాళిబొట్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా’ అంటూ సమావేశాల చివరి రోజూ Nara Lokesh ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ నిర్వహించారు. మద్యపాన నిషేధం అని మహిళల మెడల్లో తాళ్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి మండలిలోనూ, అసెంబ్లీలోనూ టీడీపీ సభ్యులు నిరసనకు దిగుతున్నారు. జంగారెడ్డిగూడెం మరణలపై టీడీపీ సభ్యులు రెండు సభల్లో పట్టు బడుతున్నారు. శాసనసభలో, మండలిలో కూడా ఇదే రకమైన డిమాండ్లతో వాయిదా తీర్మానాలు, చర్చ కోసం టీడీపీ ఆందోళనలు చేస్తుంది.
తమ డిమాండ్ల మేరకు చర్చకు అనుమతివ్వని కారణంగా చిడతలు కూడా వాయించామని టీడీపీ సభ్యులు మీడియాకు తెలిపారు. అంతేకాదు సభలో తమ డిమాండ్ విషయమై సభను అలెర్ట్ చేసేందుకు శాసనసభలో విజిల్ వేసినట్టుగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రకటించిన విషయం తెలిసిందే.మరో వైపు శాసనసమండలిలో కూడా నిన్న టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ చిడతలు వాయించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై చైర్మెన్ మండిపడ్డారు. సభ నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.