తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, అమరావతి రైతుల పూజలు.

Published : Dec 17, 2021, 02:57 PM IST
తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్యేలు, అమరావతి రైతుల పూజలు.

సారాంశం

ఏపీలోని తిరుపతిలో అమరావతి రైతులు సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, రైతులు తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే తిరుపతికి వచ్చే పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏపీ టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, అమరావతి రైతులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఈరోజు తిరుపతి సమీపంలోని అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తిరుపతి చేరుకున్న టీడీపీ నాయ‌కులు, అమ‌రావ‌తి రైతులు తిరుప‌తి వెంక‌న్న‌ను ద‌ర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ఉంచాల‌ని వేంక‌టేశ్వ‌ర స్వామిని వేడుకున్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం... వైసిపితో కలిసి నడిచేందుకు సిద్దమే..: పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

స‌భ‌కు వ‌చ్చే టీడీపీ నాయ‌కుల అడ్డ‌గింత‌..
తిరుప‌తి లో అమ‌రావ‌తి రైతులు నిర్వ‌హిస్తున్న స‌భ‌కు త‌ర‌లివ‌స్త‌న్న టీడీపీ నాయ‌కుల‌ను పోలీసుల‌ను అడ్డుకుంటున్నారు. ఈ స‌భ మ‌రి కొంత స‌మ‌యంలో ప్రారంభ‌మై.. ఆరు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అమ‌రావ‌తి రైతులు స‌భ నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని ఏపీ హైకోర్టు అనుమ‌తి ఇచ్చిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ స‌భ‌కు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ త‌ప్ప మిగిలిన అన్ని పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. ఇందులో పాల్గొన‌డానికి వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో  స‌భ‌కు వ‌చ్చే టీడీపీ నాయ‌కుల‌ను నిలిపివేస్తున్నారు. ఉద‌యం నుంచే ఏపీలోని ప‌లు చోట్ల టీడీపీ నాయ‌కుల‌ను హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే తిరుప‌తిలోకి వెళ్లే ప‌లు దారుల్లో చెక్ పోస్టు పెట్టి పలువురిని నిలిపివేస్తున్నారు. చిత్తూరుకు చెందిన మాజీ మేయ‌ర్ హేమ‌ల‌త వాహ‌నాన్ని పోలీసులు ఆపివేయ‌డంతో ఆమె బ‌స్సులో స‌భ‌కు వ‌ద్ద‌కు వ‌చ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu