
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై కక్ష కట్టారని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై మండిపడ్డారు.
సరస్వతీ భూముల విషయంలో రైతులకు అండగా ఉన్నందుకే జగన్ తనపై కక్ష కట్టారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు.రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై వైసీపీ కుట్ర చేస్తోందని విమర్శించారు.
‘వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో మీ సంగతి తేలుస్తామ’ని యరపతినేని స్పష్టం చేశారు. వైసీపీ వల్ల పల్నాడులో 25 వేల మంది క్వారీ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వైసీపీ నిజానిర్దారణ కమిటీలో అందరూ దోపిడీ దొంగలే అని యరపతినేని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.