నేను .. సాయిరెడ్డి తేల్చుకుంటాం, మధ్యలో వీళ్లెవరు: వైసీపీ నేతలపై వెలగపూడి ఫైర్

By Siva Kodati  |  First Published Dec 26, 2020, 3:02 PM IST

భూకబ్జాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి మద్ధతుగా ఇరు పార్టీల్లోని నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు


భూకబ్జాలకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి మద్ధతుగా ఇరు పార్టీల్లోని నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.

ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

Latest Videos

విషయం తెలుసుకున్న వెలగపూడి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని స్పష్టం చేశారు. తాను విజయసాయిరెడ్డికి సవాలు విసిరితే మధ్యలో వీళ్లేవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాను విజయసాయిరెడ్డిని మాత్రమే ప్రమాణం చేయమన్నాను అని రామకృష్ణ బాబు పేర్కొన్నారు. ఎంతో నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానని.. సింహాచలం వచ్చి ప్రమాణం చేయాలని వైసీపీ నేతలు చేసిన సవాల్‌ను స్వీకరిస్తానన్నారు. అయితే విజయసాయిరెడ్డి కూడా అక్కడకొచ్చి ప్రమాణం చేస్తారా అని వెలగపూడి ప్రశ్నించారు.

ఈ క్రమంలో వైసీపీ నాయకురాలు విజయనిర్మల.. సాయిబాబా చిత్రపటంతో ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడటంతో విజయనిర్మల ఆమె వెనక్కి వెళ్లిపోయారు. 

click me!