వైఎస్ జగన్ తో వల్లభనేని వంశీ భేటీ ఆంతర్యం ఇదే...

By narsimha lodeFirst Published Oct 25, 2019, 5:21 PM IST
Highlights

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపిని వల్లభనేని వంశీ వీడుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

అమరావతి: టీడీపీఎమ్మల్యే వల్లభనేని వంశీ శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.  వల్లభనేని వంశీ పార్టీ మారుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ సాగుతున్న ధర్నాల్లో  వల్లభనేని వంశీ పాల్గొనలేదు.

శుక్రవారం నాడు సాయంత్రం  ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను  క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత చోటు చేసుకొంది. సుమారు అరగంట పాటు  సీఎం వైఎస్ జగన్‌తో  వల్లభనేని వంశీ ఏకాంతంగా మాట్లాడారని సమాచారం. 

వల్లభనేని వంశీపై ఇటీవలనే కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాలను ఇచ్చారని వల్లభనేని వంశీపై కేసు నమోదైంది.

"

వల్లభనేని వంశీపై ఇటీవలనే కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాలను ఇచ్చారని వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. గత ప్రభుత్వ హాయంలో ఇళ్ల  పట్టాల కోసం ఇచ్చిన స్థలంలోనే పట్టాలు ఇచ్చినట్టుగా వంశీ సీఎం జగన్ కు వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయంలో తన ప్రమేయం లేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసు పెట్టారని వంశీ వివరణ ఇచ్చారని సమాచారం.

ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినానితో కలిసి వంశీ జగన్ నివాసానికి చేరుకొన్నారు.రెండు రోజుల క్రితం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు.  ఆ తర్వాత వంశీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్టుగా సమాచారం.

పార్టీ మార్పు విషయమై వంశీ తన అనుచరులతో చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం విషయమై ఇంకా స్పష్టత రాలేదు.అయితే పార్టీ మార్పు విషయమై వల్లభనేని వంశీ గురువారం నాడే స్పష్టత ఇచ్చారు.

శుక్రవారం నాడు ఉదయం మాజీ కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని వంశీ కలిశారు.  సుజనా చౌదరితో  కిలిసా ఆయన కారులోనే వంశీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

సుజనా చౌదరితో భేటీ అయిన తర్వాత వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి భేటీ అయ్యారు. మంత్రుల కారులోనే వంశీ సీఎం జగన్ ఇంటికి చేరుకొన్నారు.

Also Read:టీడీపీ నుంచి చాలా మంది వస్తారు: వంశీ భేటీపై సుజనా క్లారిటీ

2014 ఎన్నికలకు ముందు విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన సమయంలో ఆసక్తికర సంఘలన చోటు చేసుకొంది. దమ్ము సినిమా చూసి వస్తున్న వల్లభనేని వంశీ గన్నవరం వెళ్తుండగా విజయవాడ బెంజీ సెంటర్ లో వైఎస్ జగన్ ర్యాలీగా వస్తున్నారు. ఆ సమయంలో జగన్ ర్యాలీగా వస్తున్న సమయంలో వల్లభనేని వంశీ కారును పోలీసులు ముందుజాగ్రత్తగా నిలిపివేశారు.

Also Read:బాబుకు షాక్..?: బీజేపీ ఎంపీతో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ

దీంతో కారులో ఉన్న వల్లభనేని వంశీ కిందకు దిగారు. ఆ సమయంలో జగన్ వల్లభనేని వంశీని ఆప్యాయంగా కౌగిలించకొన్నారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ విషయమై వల్లభనేని వంశీ టీడీపీ చీప్ చంద్రబాబునాయుడుకు వివరణ ఇచ్చారు.

మంత్రి కొడాలినాని, వల్లభనేని వంశీలు మంచి మిత్రులు. కొడాలి నాని గతంలో టీడీపీలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నాడు. 2019 ఎన్నికలకు ముందు వంశీ జగన్ ను కలిశారని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ఆరోపించారు. 

Also Read:టీడీపీ నుంచి చాలా మంది వస్తారు: వంశీ భేటీపై సుజనా క్లారిటీ

ఇవాళ కూడ ఏపీ సీఎం జగన్ ను కలవడానికి మంత్రి కొడాలి నానితో కలిసి వల్లభనేని వంశీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకొంది. పార్టీ మారుతారని కొంత కాలంగా వంశఈపై ప్రచారం సాగుతోంది. జగన్ తో భేటీపై వంశీ ఏం చెబుతారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కల్గిస్తోంది.

click me!