పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంపూర్ణ మద్ధతు .. జనసేనాని వెంట టీడీపీ కేడర్ : బాలకృష్ణ (వీడియో)

By Siva Kodati  |  First Published Sep 30, 2023, 4:01 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు మద్ధతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.  టీడీపీ కార్యకర్తలు, నేతలు పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు. 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు మద్ధతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో శనివారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేయనప్పుడు దేవుడికైనా భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని.. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై స్కిల్ కేసును పెట్టారని ఆయన ఆరోపించారు. 

టీడీపీ, జనసేన కలిసి ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు బాలయ్య తెలిపారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ రేపటి నుంచి చేపడుతున్న వారాహి నాలుగో దశ యాత్రకు మద్ధతు ఇవ్వాలని నిర్నయించినట్లు బాలకృష్ణ చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటారని స్పష్టం చేశారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని బాలయ్య తెలిపారు. ఇవాళ్టీ నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. 

Latest Videos

ALso Read: అక్టోబర్ 1 నుండి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర: ఆ నేతలకు పవన్ కౌంటరిస్తారా?

ఇకపోతే.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  అక్టోబర్  1వ తేదీ నుండి నాలుగో విడత వారాహి యాత్రను ఆవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రారంభం కానుంది. టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత సాగనున్న ఈ యాత్రపై అందరి దృష్టి  నెలకొంది. ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీపై  పవన్ కళ్యాణ్ విమర్శలు చేయగానే  ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎక్కువగా స్పందిస్తున్నారు.  మాజీ మంత్రి పేర్ని నాని, కొడాలి నాని,  వెల్లంపల్లి శ్రీనివాసులు, ఏపీ మంత్రి జోగి రమేష్ తదితరులు  సీరియస్ విమర్శలు చేస్తున్నారు. 

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్టోబర్ 1 నుండి జరిగే వారాహి యాత్రలో  తనను నిత్యం విమర్శించే  వైఎస్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది.ఈ  నియోజకవర్గాల్లో యాత్ర సాగే సమయంలో  తనపై విమర్శలు చేసే  నేతలకు  పవన్ కళ్యాణ్  ఏ రకమైన కౌంటర్ ఇస్తారోననే చర్చ సర్వత్రా సాగుతుంది. 

 

click me!