రాజకీయాలకు కాసేపు బ్రేక్.. బ్యాట్ పట్టిన గంటా శ్రీనివాసరావు, మనవడితో కలిసి క్రికెట్ (వీడియో)

Siva Kodati |  
Published : Apr 18, 2023, 04:28 PM IST
రాజకీయాలకు కాసేపు బ్రేక్.. బ్యాట్ పట్టిన గంటా శ్రీనివాసరావు, మనవడితో కలిసి క్రికెట్ (వీడియో)

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పనులకు కాసేపు విరామం ప్రకటించి మనవడితో కలిసి కాసేపు క్రికెట్ ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నిత్యం రాజకీయాలు, వ్యాపారాలతో క్షణం తీరిక లేకుండా గడిపే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పనులకు కాసేపు విరామం ప్రకటించి మనవడితో ఆడుకున్నారు. విశాఖలోని తన నివాసంలో ఆయన బ్యాటింగ్ చేయగా.. మనవడు బౌలింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇదిలావుండగా.. గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. రెండేళ్లు కోవిడ్‌, తర్వాత తన అనారోగ్య కారణాల వల్లే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని చెప్పారు. మధ్యలో పార్టీ  కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. ఇప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు.

చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఇటీవల నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో.. ఇరువురు నేతల మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు.. ఇందుకు సంబంధించిన అంశాలను లోకేష్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత గంటా శ్రీనివాసరావు వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం కూడా టీడీపీ శ్రేణుల్లో సాగుతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం