చంద్రబాబు తోఫాలిస్తే.. జగన్ ధోకా , ప్రభుత్వంపై పోరాడండి : మైనార్టీలకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని పిలుపు

By Siva KodatiFirst Published Oct 23, 2022, 4:23 PM IST
Highlights

టీడీపీ మైనార్టీలకు తోఫాలిస్తే... జగన్ మైనార్టీలకు ధోకా చేశారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు వినూత్న పథకాలు పెడితే వైసీపీ తుంగలో తొక్కిందని ఆయన ఫైర్ అయ్యారు. 
 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మైనారిటీ ద్రోహీ అన్నారు టీడీపీ సీనియర్ నేత, రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమానికి జగన్ మంగళం పాడారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ముస్లీంలను ఓటు బ్యాంకుగా వాడుకుందని... మైనార్టీలకే ఖర్చు చేయాల్సిన రూ.1,683.62 కోట్ల నిధులు దారి మళ్లాయని సత్యప్రసాద్ ఆరోపించారు. మైనార్టీ సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేశారని... పథకాల్లో భారీగా కోత విధించాని అనగాని దుయ్యబట్టారు. 

టీడీపీ మైనార్టీలకు తోఫాలిస్తే... జగన్ మైనార్టీలకు ధోకా చేశారని సత్యప్రసాద్ సెటైర్లు వేశారు. ఏటా 15 వేలమంది ముస్లింలకు చంద్రబాబు ఫైనాన్స్‌ కార్పొరేషన్లతో లబ్ది చేకూర్చారని... టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు వినూత్న పథకాలు పెడితే వైసీపీ తుంగలో తొక్కిందని ఆయన ఫైర్ అయ్యారు. మైనార్టీ కార్పొరేషన్‌ను, స్కిల్ డెవలప్ సెంటర్‌లను నిర్వీర్యం చేశారని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. మూడున్నరేళ్లల్లో 63 మంది ముస్లీంలపై దాడులు జరిగాయని... టీడీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దర్గాలు, మసీదులు, ఖబరస్థాన్లు కట్టిస్తే.. నేడు రక్షణ లేదని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. మైనార్టీలందరూ ప్రభుత్వంపై సమైక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. 

Also REad:ఆధార్ కార్డ్ అడిగితే పారిపోయారు.. వాళ్లు రైతులేనా, అంతా దోపిడీ దొంగలే : అంబటి రాంబాబు వ్యాఖ్యలు

అంతకుముందు ... అమరావతి రైతుల పాదయాత్ర విరామం, ఏపీ హైకోర్టు తీర్పు తదితర అంశాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల పాదయాత్రను చూసి జగన్ వెన్నులో వణుకుపుడుతోందన్నారు. రైతులను చూసి జగన్ భయపడుతున్నారని.. అందుకే అడుగడుగునా వారి పాదయాత్రకు ఆటంకాలను సృష్టించారని బొండా ఉమా అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల పాదయాత్రలు ప్రశాంతంగా జరిగాయని.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ప్రశాంతంగానే సాగుతోందని ఉమా పేర్కొన్నారు. అయితే అమరావతి రైతుల పాదయాత్ర ప్రశాంతంగా సాగుతున్నా.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం చెప్పినట్లుగా పోలీసులు చేస్తున్నారని.. అడుగడుగునా రైతుల పాదయాత్రను అడ్డుకుంటున్నారని బొండా ఉమా మండిపడ్డారు. అలాంటి పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. మహిళా రైతులను బూటు కాళ్లతో తన్నడం సరికాదని... హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించడం లేదని బొండా ఉమా ఆరోపించారు. 

click me!