అసెంబ్లీ నుంచి సస్పెన్షన్.. అచ్చెన్నాయుడు స్పందన ఇదే

By telugu teamFirst Published Jul 23, 2019, 10:37 AM IST
Highlights

సస్పెన్షన్ పై అచ్చెన్నాయుడు స్పందించారు. అధికార పార్టీ నాయకులు తీసుకువచ్చిన వీడియోని చూపించిన స్పీకర్.. తాము తీసుకువచ్చిన వీడియోలను కూడా చూపించాలని డిమాండ్ చేశామన్నారు. ఇరు పక్షాల వీడియోలను చూసిన అనంతరం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని తాము అంటే.. స్పీకర్ వినిపించుకోలేదన్నారు.

తనను కావాలనే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వాపోయారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా... పెన్షన్ లపై చర్చ ప్రారంభించారు. కాగా... ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని పెన్షన్ ల విషయంలో అమలు చేయడం లేదని ప్రతిపక్షం ప్రశ్నించగా... ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడిన వీడియోని సభలో వినిపించారు. 

కాగా... అధికార పక్షం తీసుకువచ్చిన వీడియో కాకుండా... తాము తీసుకువచ్చిన వీడియోని ప్లే చేయాలని ప్రతిపక్ష పార్టీ నేతలు పట్టుపట్టారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో... ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేవారకు సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ పై అచ్చెన్నాయుడు స్పందించారు. అధికార పార్టీ నాయకులు తీసుకువచ్చిన వీడియోని చూపించిన స్పీకర్.. తాము తీసుకువచ్చిన వీడియోలను కూడా చూపించాలని డిమాండ్ చేశామన్నారు. ఇరు పక్షాల వీడియోలను చూసిన అనంతరం ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని తాము అంటే.. స్పీకర్ వినిపించుకోలేదన్నారు.

బలహీన వర్గానికి చెందిన తాను ఉప నాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హామీల విస్మరణను ప్రశ్నించానని తనను సస్పెండ్ చేశారన్నారు. తనను సస్పెండ్ చేయడమే వారి లక్ష్యమన్నారు. తన స్థానం నుంచి కదల్లేదని.. అసభ్యంగా కూడా మాట్లాడలేదని అయినప్పటికీ సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!